Tuesday, April 7, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅమరుల స్ఫూర్తితో తెలంగాణను కాపాడుకుందాం

అమరుల స్ఫూర్తితో తెలంగాణను కాపాడుకుందాం

- Advertisement -

బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

అమరవీరుల స్ఫూర్తితో పోరాడుదామనీ, తెలంగాణను కాపాడుకుందామని బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కల్వకుర్తి నియోజక వర్గంలోని వివిధ మండలాల నుంచి యువకులు బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. వారికి కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌తో కలిసి కండువా కప్పి ఆయన పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భం గా ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ బంగ్లాదేశ్‌, శ్రీలంక దేశాల్లో అక్కడి అధ్యక్షులకు గతంలో ఏర్పడిన పరిస్థితే తెలంగాణలో రేవంత్‌రెడ్డికీ ఏర్పడుతుందని అన్నారు. కాంగ్రెస్‌ చేస్తున్న దోపిడీని యువత గమనిస్తుందని చెప్పారు. జెన్‌ జీ కేవలం యువత మాత్రమే కాదనీ, అదొక విస్పొటక శక్తి అని అన్నారు. భవిష్యత్‌లో తెలంగాణను దోపిడీ నుంచి రక్షించే శక్తి అని అన్నారు. జెన్‌ జీ ఉద్యమం వల్ల బంగ్లాదేశ్‌లో షేక్‌ హసీనా భారత్‌కు పారిపోయి వచ్చారని గుర్తు చేశారు. నేపాల్‌ ప్రధాని కేవలం రెండు రోజుల్లోనే రాజీనామా చేయాల్సి వచ్చిందన్నారు. శ్రీలంక అధ్యక్షుడు ఆ దేశం వదిలి పారిపోయాడని చెప్పారు. అలాంటి పరిస్థితి తెలంగాణలో కూడా ఏర్పడొచ్చని ప్రవీణ్‌ కుమార్‌ హెచ్చరించారు.
కల్వకుర్తి పక్కనే ఉండే నాదర్‌గుల్‌లో 374 ఎకరాల ప్రభుత్వ భూమిని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మెఘా కృష్ణా రెడ్డి లు కలిసి పేద రైతులను ప్రయివేట్‌ బౌన్సర్లతో దాడులు చేయించి రూ.ఏడు వేల కోట్ల కుంభకోణం చేయాలని చూస్తున్నారనీ, ఈ దోపిడీని జెన్‌ జీ అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. రేవంత్‌రెడ్డి ఎలాగూ డిగ్రీ కాలేజీకి పోలేదనీ, తమ బిడ్డలు కూడా పోవద్దా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -