Tuesday, April 7, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంమధ్యప్రాచ్య శాంతి కోసం కలిసి పనిచేద్దాం

మధ్యప్రాచ్య శాంతి కోసం కలిసి పనిచేద్దాం

- Advertisement -

చైనా, రష్యాలు ప్రతిన

బీజింగ్‌ : మధ్యప్రాచ్య శాంతి కోసం రష్యా – చైనాలు ప్రతినబూనాయి. హార్ముజ్‌ జలసంధి మూసివేత అనంతం ప్రాంతీయ స్థిరత్వానికి, ఇంధన సరఫరా గొలుసుకు ప్రమాదం కలిగించే పరిస్థితిని ఖండించడానికి, ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఒత్తిడి తేవడానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తమ పదవులను ఉపయోగించుకోవాలని రష్యా- చైనాలకు చెందిన ఇద్దరు దౌత్యవేత్తలు అంగీకరించారు. వ్యూహాత్మక అంశాలపై రష్యాతో నిరంతర సంప్రదింపులు కొనసాగించడానికి తమ దేశం సిద్ధంగా ఉందని చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌యి తెలిపారు. రష్యా- చైనాలు చేసే ఉమ్మడి ప్రయత్నాల ద్వారా ప్రాంతీయ శాంతిని నెలకొల్పడం, స్థిరత్వాన్ని పరిరక్షించడమే తమ ప్రధాన లక్ష్యాలని వాంగ్‌యి అన్నారు. మధ్యప్రాచ్యంలో నెలకొన్న సంఘర్షణ విస్తరణను నివారించడానికి, ఈ ప్రాంతంలోని దేశాల సమగ్రతను కాపాడటానికి రెండు ప్రధాన శక్తులు కలిసి రావడం.. వాటి ప్రభావం చాలా కీలకం. ఈ నేపథ్యంలో రష్యా- చైనాలు ప్రాంతీయ శాంతికి, ఉద్రిక్తతలు తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -