నవతెలంగాణ – భువనగిరి
పేద ప్రజలు పట్టణంలో ఎదుర్కొంటున్న సమస్యలపై మాయా శీను గలమెత్తి పోరాడిన నాయకుడని సిపిఎం పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ అన్నారు. బుధవారం పట్టణ కేంద్రంలోని రామ్ నగర్ లో మాయ శ్రీను 15వ వర్ధంతి కార్యక్రమానంతరం రాంనగర్ లో శాఖ కార్యదర్శి బందెల ఎల్లయ్య అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాయ శ్రీను సూర్య వంశీ స్పిన్నింగ్ మిల్లో వర్కర్ గా పని చేస్తూ కార్మికుల పక్షాన నిలబడి సిఐటియు జెండాను ముందుకు తీసుకువెళ్లి నాయకుడని వారన్నారు. పట్టణంలోని ఎల్బీనగర్, వంజరి వాడ, సింగన్నగూడెం ,హౌసింగ్ బోర్డ్లో ప్రజలే ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం ప్రజలను కూడగట్టి ఆందోళనలు చేసేవాడని తెలిపారు. నిరంతరం సిపిఎం జెండా కింద పని చేస్తూ వార్డుల్లో ప్రజలను చైతన్యపరిచేవాడని, యువజన రంగం, కార్మిక రంగంలో ఎనలేని కృషి చేశారనిన్నారు. వారి ఆశయ సాధన కోసం పనిచేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు వనం రాజు, ఎల్బీనగర్ శాఖ కార్యదర్శి ఎనబోయిన లింగం, నాయకులు కోటగిరి వీరబ్రహ్మం, కొమ్ము రాములు, సాదం శంకరయ్యలు పాల్గొన్నారు.
మాయ శీనన్న ఆశయాలను సాధిద్దాం…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES