Saturday, June 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్లాస్టిక్ వాడకాన్ని నిషేదిద్దాం..

ప్లాస్టిక్ వాడకాన్ని నిషేదిద్దాం..

- Advertisement -

డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్. బి. రవీందర్ నాయక్
నవతెలంగాణ – సుల్తాన్ బజార్  : ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేదించి, పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు (డైరెక్టర్ ఆఫ్ హెల్త్) డాక్టర్ రవీందర్ నాయక్ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని  ప్లాస్టిక్, కాలుష్యాన్ని నిర్మూలించండి అనే నినాదంతో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ ఆధ్వర్యంలో ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని పర్యావరణ పరిరక్షణ బ్రోచర్ ను  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవీందర్ నాయక్ మాట్లాడుతూ ..ప్లాస్టిక్ వాడకాన్ని నిషేదించి, పర్యావరణాన్ని కాపాడు కుందాం అనే నినాదాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని సూచించారు. పర్యావరణానికి కీడు చేసే చర్యల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించి, ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడువాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. మార్కెట్ కొనుగోళ్ల కోసం గుడ్డ సంచులు, పనిచేసే ప్రదేశంలో స్టీల్, పింగాణి పాత్రలు వాడకం ఎంతో ఉత్తమమన్నారు. ఉత్సవాల సమయంతో పర్యావరణ హిత వస్తువులైన ఉక్కు, రాగి, మట్టి, చెక్కలను వినియోగించాలని తెలిపారు. ప్లాస్టిక్ తో చేసిన బొమ్మలు కొనవద్దని సూచించారు. మాంసం, చేపలు, గుడ్లు కొనుగోలు కోసం ప్లాస్టిక్ సంచులకు వాడొద్దనే విషయాలపై వైద్య ఆ రోగ్య శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సమాజంలో, ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు. పోస్టర్లు, కరపత్రాల ద్వారా అందుకోసం విస్త్రతంగా ప్రచారం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ మోజీరామ్ రాథోడ్, సీపీఓ డాక్టర్ పద్మజ, జాయింట్ డైరెక్టర్ (అడ్మిన్) డాక్టర్ మోతీలాల్, డి ప్యూటీ డైరెక్టర్ అనురాధ, శ్వేతా మహంతి, సుస్మిత, సీఏవో వెంకన్నగౌడ్, పీవో (ఎనోచ్ఎం) డాక్టర్ నందిత, ఎన్పీసీసీహెచ్ఎచ్ కన్సల్టెంట్ డాక్టర్ సైదులు, మామిడి ప్రభాకర్, హరి, హెల్త్ ఎడ్యుకేటర్ కిరణ్ రెడ్డి , టీఎన్జీవో యూనిట్ అధ్యక్షుడు ప్రభాకర్,  కార్యదర్శి హరి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -