వేసవి సెలవుల ఆనందం
ఆస్వాదిస్తే అతి మధురం
బంధువుల ఇళ్లకు చేరి
అందరం ఒకచోట కలిసి
వినోదాలతో హాయిగా గడిపి
వెన్నెలలు విరబూయాలి
పూర్వ వైభవం తేవాలి
దాగుడు మూతలు దండాకోర్
చదరంగమూ గిల్లీ దండా
పచ్చీసూ అష్టా చెమ్మా
చెమ్మ చెక్కా అచ్చెన గండ్లూ
అనంతమైన ఆ ఆటలు
ఏమైనాయో తెలియదు
షటిల్ టెన్నికాయిట్
రింగుబాల్ వాలీబాల్
వ్యాయామాన్ని ఇచ్చే ఆటలు
ఎవ్వరూ ఎందుకు మెచ్చరు?
ఆరోగ్యాన్ని ఎందుకు పెంచరు?
ఆట అంటే కేవలం క్రికెట్టు
లేకపోతే టీవీలకు బానిసలు
సెల్ ఫోన్ల ఫీచర్ల
వలలో పడి విల విల
శారీరక వ్యాయామం శూన్యం
అనారోగ్యాలకు ఆహ్వానం
ఫాస్ట్ ఫుడ్స్ కూల్ డ్రింకుల
రుచులలో మరగి పోయి
ఆయుష్షును ఆరోగ్యాన్ని పెంచే
పండ్ల రుచులు మరచి పోయి
ఎందుకు రోగాల పాలు?
డబ్బులన్నీ నీళ్ళపాలు
మళ్ళీ తెద్దాం ఆరోజులను
అంతరిస్తున్న ఆ ఆటలను
వెలుగులోకి తీసుకువద్దాం
ఆరోగ్యంగా హాయిగా జీవిద్దాం
పూర్వ వైభవాన్ని ఆస్వాదిద్దాం
- సరికొండ శ్రీనివాసరాజు, 8185890400