నవతెలంగాణ – మద్నూర్
మన పండుగ మన సంస్కృతి ఏడాదికి ఒక్కసారి వచ్చే మన కుల పండుగ.. అదే పద్మశాలి కుల బంధువులైన మనం శ్రీభక్త మార్కండేయ వంశస్తులైన మనం జరుపుకునే మన గొప్ప పండుగ శ్రీ మహర్షి భక్త మార్కండేయ పండుగ. మనం గొప్పగా కనుల పండుగ జరుపుకుందాం అంటూ పద్మశాలి సంఘం కార్యనిర్వాహక మండల అధ్యక్షులు రచ్చ కుశాల్ ఒక ప్రకటన ద్వారా కులస్తులందరికీ విజ్ఞప్తి చేశారు.
ఆలయంలో బుధవారం రోజున ఉదయం 7 గంటలకు అభిషేకం,.10 గంటల నుండి కీర్తన భజన, మధ్యాహ్నం 12-30 గంటలకు శ్రీ శ్రీ శ్రీ మహర్షి భక్త మార్కండేయ జన్మదినం, హారతి కలదు అనంతరం మహా అన్న ప్రసాదం భక్తులు అందరూ స్వీకరించి ఆ భగవంతుని ఆశీర్వాదం పొందగలరు. ఈ కార్యక్రమంలో పద్మశాలి కుల బంధువులు భక్తులు ప్రజలు పాల్గొగలరని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. భక్తులందరికీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.



