Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంఅచ్యుతానందన్‌ ఆశయాలు కొనసాగిద్దాం

అచ్యుతానందన్‌ ఆశయాలు కొనసాగిద్దాం

- Advertisement -

సంస్మరణ సభలో బి వెంకట్‌, టి సాగర్‌ పిలుపు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

కేరళ మాజీ ముఖ్యమంత్రి విఎస్‌ అచ్యుతానందన్‌ ఆశయాలను కొనసాగిద్దామని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్‌, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్‌ పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్‌లోని రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల రాష్ట్ర కార్యాలయంలో అచ్యుతానందన్‌ సంస్మరణ సభను నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కమ్యూనిస్టు ఉద్యమంలో అత్యుత్తమ నాయకుడు అనుభవజ్ఞుడైన అచ్యుతానందన్‌ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. కేరళలో వివిధ ప్రజా సమస్యలపై పోరాటాలకు నాయకత్వం వహించిన సమర్థుడైన నాయకుడని అన్నారు. 2006 నుంచి 2011 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నపుడు శ్రామిక ప్రజల సంక్షేమం కోసం అనేక శాసన, పరిపాలనా చర్యలు తీసుకున్నారని వివరించారు. కేరళలో కమ్యూనిస్టు ఉద్యమం స్థిరమైన వృద్ధిని సాధించిందని చెప్పారు. కఠినమైన జీవన శైలి, సామాజిక న్యాయం పట్ల అచంచలమైన నిబద్ధతకు పేరుగాంచిన అచ్యుతానందన్‌ కేరళ రాజకీయాలపై చెరగని ముద్ర వేశారని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ వెంకట్రాములు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్‌ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img