ఏఎంసీ చైర్మన్ లక్ష్మీనారాయణ.
నవతెలంగాణ – జన్నారం
జల్, జంగిల్, జమీన్ నినాదంతో అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన ధీరుడు. ఆదివాసుల ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పిన యోధుడు స్వేచ్ఛ సమానత్వం కోసం ప్రాణాలను అర్పించిన మహనీయుడు గోండుల గుండె ధైర్యం ఆదివాసుల ఆరాధ్య దైవం కొమురం భీమ్ అని జన్నారం ఎఎంసి చైర్మన్ దుర్గమ్మ లక్ష్మీనారాయణ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముజాఫర్ అలీ ఖాన్ అన్నారు. బుధవారం కొమరం భీం జయంతి సందర్భంగా మండలంలోని ఇంధన్ పల్లి చౌరస్తా వద్ద ఉన్న కొమరం భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ కొమరం భీం అడుగుజాడల్లో నడుస్తూ అతని ఆశయ సాధన కోసం కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సయ్యద్ ఇసాక్, మామిడిపల్లి ఇందయ్య, కంటెం శంకర్, అజ్మీరా నందు నాయక్, ముత్యం సతీష్, రియాసత్ అలీ, బాదావత్ సుధాకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
కొమరం భీమ్ స్ఫూర్తిని కొనసాగిద్దాం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES