Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుక్యూబాకు సంఘీభావాన్ని ప్రకటిద్దాం..

క్యూబాకు సంఘీభావాన్ని ప్రకటిద్దాం..

- Advertisement -

సోషలిస్ట్ వ్యవస్థను కాపాడుకుందాం : సీపీఐ(ఎం) పిలుపు
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
: క్యూబాకు సంఘీభావాన్ని ప్రకటిద్దాం అని, సోషలిస్టు వ్యవస్థను కాపాడుకుందాం అని సీపీఐ(ఎం) నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. కమ్యూనిస్టు పార్టీ అధికారంలో ఉన్న క్యూబా పైన సామ్రాజ్యవాద దేశమైన అమెరికా తీవ్రమైన ఆర్థిక అంశాలను విధిస్తూ క్యూబా ప్రభుత్వాన్ని అక్కడి ప్రజలను ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నదని. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా క్యూబాలో కమ్యూనిస్టు పార్టీ విజయం సాధించటం జరిగిందని, దీన్ని ఓర్వలేని అమెరికా క్యూబా పైన ఆర్థిక దౌత్యపరమైన ఆంక్షలు పెడుతూ తమ ఆధిపత్యాన్ని కొనసాగించటానికి ప్రయత్నిస్తున్నదని, అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా క్యూబా నికరంగా నిలబడుతూ తమ ప్రజలకు అండగా ఉండటం జరుగుతుందని తెలిపారు. కార్మిక వర్గ నాయకత్వంలో సోషలిస్టు వ్యవస్థను నిర్మిస్తున్న క్యూబా దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రపంచంలోనే లౌకిక వాదసభ్యులందరి పైన ఉందని గుర్తు చేశారు. ఆ దేశ ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రజాతంత్ర వాదులదని, అందువల్ల క్యూబా ప్రజలకు అండగా దేశ ప్రజలు నిలవాలని సీపీఐ(ఎం) పిలుపునివ్వడం జరిగిందని తెలిపారు. అందులో భాగంగా ఈనెల 4, 5 తేదీలలో సీపీఐ(ఎం) కార్యకర్తలు సానుభూతిపరుల వద్ద తగ్గకుండా విరాళాలు సేకరించాలని నిర్ణయించడం జరిగిందని, జిల్లాలో ఉన్న పార్టీ సభ్యులు, సానుభూతిపరులు, ప్రజాతంత్ర వాదులు తమ సంఘీభావాన్ని ప్రకటించి వారికి అండగా ఉండాలని పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నూర్జహాన్, వెంకటేష్, శంకర్ గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు సుజాత, కొండగంగాధర్, సురేష్, వై గంగాధర్, నాయకులు ఏం. గంగాధరప్ప తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad