Friday, January 2, 2026
E-PAPER
Homeఆదిలాబాద్సమిష్టి కృషితో గ్రామాలను అభివృద్ధి చేద్దాం

సమిష్టి కృషితో గ్రామాలను అభివృద్ధి చేద్దాం

- Advertisement -

– కుబీర్ ఎంపిడిఓ గంగా సాగర్ రెడ్డి
నవతెలంగాణ – కుభీర్
కొత్తగా ఎన్నికైన గ్రామ సర్పంచులు పాలకవర్గ సభ్యులు అంతా ఏకమై సమిష్టి కృషితో గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని ఎంపీడీవో గంగాసాగర్ రెడ్డి సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో కొత్తగా ఎన్నికైన సర్పంచులు, ఉపసర్పంచ్లు, వార్డు మెంబర్లకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను సక్రమంగా ఖర్చు చేయడంతోపాటు అభివృద్ధికి పాటుపడాలని కోరారు ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా పాలకవర్గ సభ్యులు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి తమ దృష్టికి తీసుకువస్తే ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని వెల్లడించారు. ఇందులో ఎంపీఓ బిమేష్ ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -