Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeమానవిడల్‌నెస్‌ను తొలగిద్దాం....

డల్‌నెస్‌ను తొలగిద్దాం….

- Advertisement -

పర్యావరణ కాలుష్యం వల్ల యువతకి చర్మం డల్‌గా మారిపోతున్నది. దీంతోపాటు ముడతలు, కళ్లకింద నల్లగా మారిపోవటం సాధారణమైపోయింది. అలాంటి డల్‌నెస్‌ చర్మాన్ని మిల మిల మెరిసేలా చేసుకోవాలంటే ఈ సింపుల్‌ చిట్కాలు ఫాలో అవ్వాల్సిందే.
కొబ్బరి నీళ్లను వేళ్లతో అద్దుకుంటూ ముఖానికి అప్లై చేస్తూ, మసాజ్‌ చేసుకోవాలి. పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రపరుచుకోవాలి. నిస్తేజంగా మారిన ముఖ చర్మం జీవకళతో తొణికిసలాడుతుంది.
టీ స్పూన్‌ టొమాటో గుజ్జు, శనగపిండి, చిటికెడు పసుపు, అర టీ స్పూన్‌ నిమ్మరసం, కలిపి పేస్ట్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లయి చేసి, కళ్లమీద గుండ్రంగా తరిగిన కీరా ముక్కలు ఉంచి ఇరవై నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. తర్వాత ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తుంటే కళ్లకింద నల్లని వలయాలు తగ్గుముఖం పట్టి, ముఖం కాంతిమంతం అవుతుంది.
రెండు టీ స్పూన్ల గోధుమ పిండిలో తగినన్ని పాలు పోసి, ఉండలు లేకుండా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, వేళ్లతో సున్నితంగా రుద్దాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. జీవం లేని ముఖ చర్మం కళకళలాడుతుంది.

ఉప్పు కంటెంట్‌ లేని టేబుల్‌ స్పూన్‌ బటర్‌ని బ్లెండ్‌ చేయాలి. అందులో స్ట్రాబెర్రీ గుజ్జును కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసి, పది నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఈ ప్యాక్‌ ముడతలను నివారిస్తుంది. చర్మాన్ని మదువుగా మారుస్తుంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad