Saturday, August 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిద్దాం

బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిద్దాం

- Advertisement -

రాయపోల్ ఎస్ఐ కుంచెం మానస..
నవతెలంగాణ – రాయపోల్ 

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలిద్దామని, బాల కార్మికులతో పనులు చేయిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని రాయపోల్ ఎస్ఐ కుంచెం మానస అన్నారు. గురువారం రాయపోల్ మండలంలో ఆపరేషన్ ముస్కాన్ -11 లో భాగంగా కార్మిక శాఖ అధికారులతో కలిసి తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల కార్మికుల చేత ఎటువంటి పనులు చేయించరాదని, వారిని పాఠశాలలో విద్యను అభ్యసించడానికి ప్రోత్సహించాలన్నారు.

బడి ఈడు పిల్లలు అదరూ బడిలోనే ఉండాలని, బడి ఈడు పిల్లలను ఎలాంటి పనులు చేయించరాదన్నారు.ఆపరేషన్ ముస్కాన్ తనిఖీలలో భాగంగా జిల్లా అసిస్టెంట్ లేబర్ అధికారి పాతూరు జ్యోతి ఆధ్వర్యంలో కార్మిక శాఖ అధికారులు, స్థానిక పోలీసులు కలిసి రాంసాగర్ గ్రామంలో గల  ప్రీమియం చిక్ ఫీడ్ సంస్థ యందు తనిఖీ నిర్వహించగా  అందులో పని చేయుచున్న 5 గురు బాలకార్మికులను గుర్తించడం జరిగిందని వారిని పని నుంచి విముక్తి కల్పించి, అట్టి సంస్థ యజమానులు అయిన  సత్యేంద్ర కుమార్ , సమాధాన్ తాత్యాబు లపై అసిస్టెంట్ లేబర్ అధికారి పాతూరి జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రాయపోల్ ఎస్సై మానస పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -