నవతెలంగాణ – డిచ్ పల్లి
శాస్త్రీయ విద్య సాధన కై ఉద్యమించాలని పి డి ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. గురువారం పి డి ఎస్ యూ ఆధ్వర్యంలో డిచ్ పల్లి మండల కేంద్రంలోని ఘనపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వాలు విద్యార్థులకు ఉపయోగపడే విధానాలను విద్యలో ప్రవేశపెట్టడం లేదని , కేంద్ర ప్రభుత్వం విద్యలో శాస్త్రీయంగా ఉన్నటువంటి సైన్స్ పాఠ్యాంశాలను తొలగిస్తూ అశాస్త్రీయ పాఠ్యాంశాలను పెడుతూ విద్యార్ధుల మెదళ్లను కలుషితం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రశ్నించే తత్వాన్ని విద్యార్థి దశ నుండే నేర్చుకోవాలని, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకై బడ్జెట్లో విద్యకు అధిక సంఖ్యలో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యూ నాయకులు అక్షయ్,గౌతం రాజ్, రాకేష్, హుస్సేన్, వంశీ తదితదిరులు పాల్గొన్నారు.
శాస్త్రీయ విద్యా సాధనకై పోరాడుదాం: పిడిఎస్ యూ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES