నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
కార్మికుల హక్కుల కొరకు ప్రతి ఒక్కరు పోరాడాలని సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివ కుమార్ కోరారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ లో టియుసిఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా రాజకీయ శిక్షణా తరగతులు జిల్లా అధ్యక్షుడు గొడ్డలి నర్సయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి క్లాస్ మాట్లాడుతూ కార్మిక హక్కులను కాలరాస్తున్న ఈ దోపిడీ ప్రభుత్వాలపై తిరుగుబాటు జెండా ఎగరవేయకుండా సమస్యలు పరిష్కారము కావని అన్నారు.సంగటిత అసంఘటిత కార్మికులను ఐక్యం చేస్తూ భారత రాజ్యాంగం ప్రకారం ఉన్నటువంటి చట్టాలను అమలుపరచకుండా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని నిర్వీర్యం చేస్తూ, రద్దు చేయటం సమంజసం కాదని వాటిని సాధించుకోవడం కోసం పోరాటం చేయాలని అన్నారు.
కనీస వేతనాల చట్టాల ప్రకారం 26 వేల జీతం చెల్లించాలని,వ్యవసాయ పనులలో, భవన నిర్మాణ కార్మిక రంగంలో పనిచేస్తున్న కూలీలకు లింగ వివక్షత లేకుండా సమాన పనికి, సమాన వేతనం చెల్లించాలని అన్నారు.అదేవిధంగా కేజీబీవీ రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులకు పని భారము తగ్గించి,ఖాళీలను భర్తీ చేసి సరియైన వేతనము చెల్లించాలని అన్నారు.రెండవ క్లాస్ కార్మిక చట్టాల గురించి టియుసిఐ రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఎల్ పద్మ మాట్లాడుతూ.. కార్మికులకు 29 రకాల చట్టాలు ఉన్నాయని వాటిని రద్దు చేసి నాలుగు లేబర్ కోడులుగా చేసి కార్మికుల శ్రమను దోపిడి చేస్తున్నారు అన్నారు.
పూర్వకాలంలో భూస్వాముల కింద బానిస బతుకులో బతికిన విధంగా సెలవులు లేకుండా చేస్తూ వారి యొక్క శక్తి సామర్థ్యాలను కూడా నిర్వీర్యం చేసి అక్షేతనంగా శక్తిహీనులుగా చేస్తున్నారు. పారిశ్రామిక విభాగాల చట్టం, ఇన్సూరెన్స్ చట్టం, బోనస్ చట్టం, వేతనాల చెల్లింపుల చట్టం ఇంకా అనేక రకాల చట్టాలపై అవగాహన కల్పిస్తూ దోపిడి నుండి మనలో మనం రక్షించుకోవాలని కార్మిక రాజ్య స్థాపన జరగాలని కోరారు. అందుకు ప్రపంచ కార్మికులారా ఏకంకాండని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టియుసిఐ రాష్ట్ర అధ్యక్షులు కే.సూర్య సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ జిల్లా నాయకులు కారింగుల వెంకన్న, పిఓడబ్ల్యు జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక, టియుసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ హుస్సేన్, సహాయ కార్యదర్శి గోగుల వీరబాబు, కోశాధికారి ఐతరాజు వెంకన్న, జిల్లా కమిటీ సభ్యులు దర్శనం రమేష్, చెడుపాక రవి,శేషగిరి,రజాక్, కిట్టయ్య, సంసోన్, సుధాకర్, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.