Thursday, November 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పోరాడుదాం వెల్ఫేర్ బోర్డును నిలబెట్టుకుందాం

పోరాడుదాం వెల్ఫేర్ బోర్డును నిలబెట్టుకుందాం

- Advertisement -

భావన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నిక్సన్
నవతెలంగాణ – వనపర్తి 

పెద్దమందడి అక్రమంగా వెల్ఫేర్ బోర్డు నిధులను ప్రైవేట్ కంపెనీలకు దారిమలుస్తున్న నిధులను రాబాట్టుకునేందుకు పోరాడుదాం.. ప్రభుత్వం ద్వారానే వెల్ఫేర్ బోర్డును నిలబెట్టుకుందామని భావన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నిక్సన్ జిల్లా ఉపాధ్యక్షులుకె వెంకటయ్య పిలుపునిచ్చారు. గురువారం నాడు పెద్దమందడి మండల కేంద్రంలో జరిగిన భవన నిర్మాణ కార్మిక సంఘం సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. వెల్ఫేర్ బోర్డు స్కీములను ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చిన అనుమతిని వెంటనే ఉపసంహరించుకోవాలని బోర్డు ద్వారానే కార్మికులకు సంక్షేమ పథకాలు అందించాలని, సి.ఎస్.సి హెల్త్ టెస్టులను రద్దు చేయాలని పెన్షన్ సహజ మరణానికి రూ.500000 ఇతర పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 25న మంగళవారం వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా ఉంటుందని వారు చెప్పారు. హెల్త్ టెస్టులు పేరుతో ప్రభుత్వం సుమారు 500 కోట్లు దుర్వినియోగం చేసిందని జీఓ నెంబర్ 12 ను సవరించాలని 60 సంవత్సరాలు వయసు పైబడిన కార్మికులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని పిల్లలకు స్కాలర్షిప్లు గృహ వసతి కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు కురుమూర్తి కోశాధికారి శ్రీను కుమ్మరి ఆశన్న టీ నాగ భూషణ్ జంగం రమేష్ రంగన్న గొల్లమొగులయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -