Thursday, February 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కేంద్రం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ రద్దుకై పోరాడుదాం

కేంద్రం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ రద్దుకై పోరాడుదాం

- Advertisement -

 టి యు సి ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ పిలుపు
నవతెలంగాణ – దర్పల్లి

కేంద్రం బిజెపి ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోర్టులను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ చట్టం 2020 25 విత్తన సవరణ బిల్లు ఎల్ఐసి లో 100% విలేజ్ పెట్టుబడును అనుమతించడం లాంటి ప్రమాదకర నిర్ణయాలు ఉపసంహరించాలని కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానా లు వెనక్కి తీసుకోవాలని, కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం రోజున, ధర్పల్లి మండల కేంద్రంలో గాంధీ చౌక్ లో *టెడ్ యూనియన్ సెంటర్ అప్ ఇండియా (టి యు సి ఐ)ఆధ్వర్యంలో సమ్మె చేయడం జరిగింది.

ఈ సందర్భంగా టి యు సి ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ మాట్లాడుతూ మరణాలకు  మరణ శాసనంగా తెచ్చిన నాలుగు లేబర్ కోడుల రద్దుకై పోరాడాలని పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కాపాడుకునేంతవరకు పోరాడుతామని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడుల అమలుతో 40 కోట్ల సంఘటిత అసంఘటిత కార్మికులు వారి కుటుంబాలు చితికిపోయేలా కార్పొరేట్ల లాభాలు ప్రోగేసుకోవడానికి మార్గం సుగమం చేసిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక కార్పోరేట్ అనుకూల విధానాలను ఉపసహరించుకోవాలని కార్మిక వర్గం ప్రతిఘటనకు పూలుకోవాలని లేబర్ కోడ్స్ రత్తయ్య వరకు ఐక్యంగా పోరాడాలని కార్మికులకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో టియుసిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎం అనిస్, తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ (టియుసిఐ) మండల అధ్యక్షులు ఒ ఆశన్న, ప్రధానకార్యదర్శి ఒ.సాయన్న, ఏఐపికెఎంఎస్ జిల్లా ప్రధానకార్యదర్శి ఇ రమేష్, సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ డివిజన్ నాయకులు ఆర్ దామోదర్, జిపి వర్కర్స్ నాయకులు జె విలాస్, టీ జగన్, బి భోజన్న, బి చందర్, జె సులోచన, డి శారదా, ఆర్ సాయమ్మ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -