నవతెలంగాణ – కామారెడ్డి
ఈనెల 5న కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ ముందు జరిగే యుఎస్పిసి ( ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ) ధర్నా నిర్వహిస్తామని ఆ సంఘ సభ్యులు తెలిపారు. ఈ ధర్నాకు మద్దతు ఇవ్వాలని, రామ్ సేఫ్, అంబెడ్కర్ యువజన సంఘం, ఇండియన్ లాయర్స్, ప్రొఫెషనల్ అసోసియేషన్, లాంబాడహక్కుల పోరాట సమితి, బహుజన సంఘాల ఐక్యవేదిక, బిసి సంక్షేమ సంఘం, భారత్ ముక్తి మోర్చా, బహుజన విద్యార్థి మోర్చా నాయకులను కోరడం జరిగిందనీ అత్యా సంఘాల పోరాట కమిటీ నాయకులు అన్నారు. ఈ ధర్నాకు మద్దతుగా ఈ సంఘాల నాయకులు సంపూర్ణ మద్దతును ప్రకటించి ఉద్యమంలో పాల్గొని విజయవంతం చేస్తామని ప్రకటించి కరపత్రాలు ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా టి ఎస్ యు టి ఎఫ్ ఆకులబాబు, నాయకులు దాస్ రాం నాయక్ లు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్దేశ పూర్వకంగానే ప్రభుత్వ విద్యను ప్రజలకు అందకుండా చేస్తుందని అన్నారు. రెవల్లి శంకర్ మాట్లాడుతూ, ప్రయివేటు ,కార్పొరేట్ వ్యస్వస్థలకు విచ్చలవిడిగా అనుమతి ఇస్తూ ప్రభుత్వ రంగాలను నిర్వీర్యం చేస్తున్నాయని అందుకే వాటిని కాపాడుకోవడానికి ఐక్యంగా ప్రజలందరూ ముందుకు వచ్చి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఆకుల బాబు మాట్లాడుతూ ఉద్యోగులకు హెల్త్ కార్డులు పనిచేయక ప్రయివేటు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకొని ఆర్థిక భారాన్ని మోస్తున్నారనీ, పెండింగ్ బిల్లులు, డి ఎ లు, పిఆర్సి ఇవ్వకుండా ఉద్యోగులపై సవతి తల్లి ప్రేమను చూపిస్తోంది అని విమర్శించారు.
బామ్ సేఫ్ రాష్ట్ర అధ్యక్షులు నరేందర్ మాట్లాడుతూ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐ ఎల్ పి ఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంసన్, భారత్ ముక్తి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రెవల్లి శంకర్, అంబెడ్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు గంగారాం,మల్లన్న, ముస్లింమోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఫహీమోద్దీన్ , బహుజన సంఘాల ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ క్యాతం సిద్దరములు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు సాప శివరాం, భారత్ బహుజన విద్యార్థి మోర్చా రాష్ట్ర కన్వీనర్ రవితేజ, గణేష్ నాయక్, టీఎస్ యుటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు సాయి గౌతం, నాంపల్లి తదితరులు పాల్గొన్నారు.