Thursday, February 5, 2026
E-PAPER
Homeజిల్లాలుపొత్తుధర్మం పాటిద్దాం..సీపీఐ(ఎం) అభ్యర్ధిని గెలిపిద్దాం: ఎమ్మెల్యే జారె

పొత్తుధర్మం పాటిద్దాం..సీపీఐ(ఎం) అభ్యర్ధిని గెలిపిద్దాం: ఎమ్మెల్యే జారె

- Advertisement -


నవతెలంగాణ – అశ్వారావుపేట

రాజకీయ అవగాహనతో, మున్సిపాల్టీ ఎన్నికల్లో వామపక్షాలతో కుదుర్చుకున్న పొత్తు ధర్మాన్ని పాటించి సీపీఐ(ఎం) అభ్యర్ధులను గెలిపించుకుందాం అని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అన్నారు. అశ్వారావుపేట మున్సిపాల్టీ 21 వ వార్డు సీపీఐ(ఎం)  అభ్యర్ధిని తగరం నిర్మల విజయాన్ని కాంక్షిస్తూ గురువారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అశ్వారావుపేట మున్సిపాల్టీ లో సీపీఐ(ఎం) – కాంగ్రెస్ పొత్తు తో అన్ని వార్డులను అత్యధిక మెజార్టీ లో విజయం సాధిస్తున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా నాయకులు పుల్లయ్య,చిరంజీవి,కాంగ్రెస్ నాయకులు కేపీ ఇబ్రహీం,దుర్గారావు,తగరం ముత్తయ్య,కానూరి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -