Friday, May 30, 2025
E-PAPER
Homeమానవిఇంట్లోనే పండిద్దాం…

ఇంట్లోనే పండిద్దాం…

- Advertisement -

ఏ కూరలో అయినా దింపేముందు కాస్త కొత్తిమీర వేస్తే.. ఆ రుచే రుచి. లస్సీలు, ఇతర పానీయాల్లోనూ పుదీనా, తులసి, కొత్తిమీర అందించే తాజాదనమే వేరు. అయితే మార్కెట్‌లో తెచ్చిన కొత్తిమీర కన్నా ఇంట్లో పెంచితే ఎప్పుడంటే అప్పడు తాజాగా వాడుకోవచ్చు. దీనిని పెంచడం పెద్ద కష్టమేమి కాదు. ఇంట్లో చాలా సింపుల్‌గా పెంచేయవచ్చు. అదెలాగో చూసేయండి మరి.
– కొత్తిమీర, పుదీన వంటి వాటిని మార్కెట్‌ నుంచి కొమ్మలతోనే తెచ్చుకుంటాం. వాటిని కాండం కింది భాగంలో కొద్దిగా 45 డిగ్రీల కోణంలో కత్తిరించాలి. అడుగు భాగంలో ఉండే ఆకులను తుంచేయాలి.
– కప్పులు, గాజు గ్లాసులు ఇలా వేటిలోనైనా నీటిని పోసి ఖాళీగా ఉన్న కాడ భాగం మునిగేలా చూసుకోవాలి. కుళాయి నీరు, వడపోసిన నీరు ఏదైనా ఫర్వాలేదు. వీటిని ఎండ బాగా తగిలేచోట ఉంచుకోవాలి. రెండు వారాల తర్వాత గమనించండి. సన్నటి వేర్లు రావడం కనిపిస్తుంది. రోజూ నీటిని పోయాలి. అలాగే కాస్త పచ్చగా కనిపించగానే మార్చడమూ మర్చిపోవద్దు.
– వేర్లు కొంచెం మందం అయ్యాక కుండీల్లోకి మార్చుకోవచ్చు. కావాల్సినప్పుడల్లా ఆకులను తాజాగా కోసేసుకుంటే సరి!

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -