Sunday, March 8, 2026
E-PAPER
Homeహెల్త్సరదాగా వుందాం... బాగా రాద్దాం

సరదాగా వుందాం… బాగా రాద్దాం

- Advertisement -

పదవతరగతి పరీక్షలు మొదలవుతున్నాయి. పిల్లల ముఖాల్లో టెన్షన్‌… పేరెంట్స్‌ ముఖాల్లో మరింత టెన్షన్‌. ఇంట్లో టెన్షన్‌… పిల్లల గదిలో పుస్తకాలు… ఈ సీరియస్‌ వాతావరణంలో ఒక చిన్న కథ.

రాహుల్‌ అనే 10వ తరగతి విద్యార్థి. పరీక్షల ముందు చాలా టెన్షన్‌. అమ్మ అడిగింది ”ఎన్ని మార్కులు వస్తాయి?” అని.
అమ్మ: ”పెన్‌ పెట్టుకున్నావా?”
నాన్న: ”హాల్‌ టికెట్‌ తీసుకున్నావా?”
అమ్మమ్మ: ”తలపై నూనె రాసుకున్నావా?”
రాహుల్‌ అన్నాడు: ”పరీక్ష రాయడానికి వెళుతున్నాను… పెళ్లికి కాదు కదా!”
సెంటర్‌కి వెళ్లాక ఒక్కసారిగా కంగారు. అతను తనకు తానే చెప్పుకున్నాడు: ”అమ్మ ముందుగా హాల్‌ టికెట్‌ తీసుకెళ్లగలిగితేనే గొప్ప మార్క్‌!” అంది అని.
పేపర్‌ చూసి కంగారు పడ్డాడు. ఒక్కసారిగా మెదడు బ్లాంక్‌. అప్పుడు అతను తనకు తానే అనుకున్నాడు. ఇది ప్రశ్నాపత్రం మాత్రమే… పులి కాదు కదా! నన్ను తినేసేది కాదు!”
ఒక్క నిమిషం లోతుగా ఊపిరి పీల్చుకున్నాడు. నెమ్మదిగా మొదటి ప్రశ్న చదివాడు. తెలిసినదాన్ని రాయడం మొదలుపెట్టాడు. పరీక్ష అయ్యాక బయటకి వచ్చి అన్నాడు. అయ్యో! నేను పేపర్‌ని చూసి భయపడ్డాను… పేపర్‌ నన్ను చూసి కాదు!”
అప్పుడు అతనికి అర్థమైంది. టెన్షన్‌ ఎక్కువైతే మెదడు పనిచేయదు. శాంతిగా ఉంటే గుర్తొస్తుంది.
”బ్లాంక్‌ బ్రెయిన్‌ బాబు”
సాయి పేపర్‌ తీసుకున్న వెంటనే మెదడు బ్లాంక్‌. అతను పైకి చూసి ఇలా అన్నాడు… ”బ్రెయిన్‌ గారూ… మీరు ఆన్‌లో ఉన్నారా?”
ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని లోతుగా ఊపిరి పీల్చుకున్నాడు. మళ్లీ ప్రశ్న చదివాడు. అప్పుడే గుర్తొచ్చింది. బయటకి వచ్చి అన్నాడు… ”బ్రెయిన్‌కి కూడా కొంచెం రీస్టార్ట్‌ కావాలి!”
మెసేజ్‌: టెన్షన్‌ పెరిగితే మెదడు ఆఫ్‌ అవుతుంది. శాంతి పెరిగితే మెమరీ ఆన్‌ అవుతుంది.
పరీక్షల ముందు భయం పెరిగితే మన మెదడులో స్ట్రెస్‌ హార్మోన్‌ పెరుగుతుంది. అప్పుడు చదివినది గుర్తు రావడం కష్టమవుతుంది. కానీ నవ్వితే… లోతుగా ఊపిరి పీల్చుకుంటే… ”నేను చేయగలను” అని అనుకుంటే… మెదడు ప్రశాంతంగా పనిచేస్తుంది.
విద్యార్థులకు :
పేపర్‌ కష్టం అనిపించవచ్చు… కానీ అది జీవితం కాదు. ఒక్క ప్రశ్న రాకపోతే ప్రపంచం ఆగిపోదు. తెలిసినదాన్ని మొదట రాయండి.
టైమ్‌ మేనేజ్‌ చేయండి. ముఖ్యంగా మార్క్‌ షీట్‌లో వచ్చే సంఖ్య మీ విలువ కాదు. పేపర్‌ నిన్ను చూసి భయపడాలి… నువ్వు ఒక విలువైన మనిషివి.
తల్లిదండ్రులకు :
ఈ రోజుల్లో పిల్లలకు మార్కుల కంటే భరోసా ఎక్కువ అవసరం.
దయచేసి ఇలా చెప్పండి:
”ఫలితం ఏదైనా… మేము నీతోనే ఉన్నాం.” ఆ మాట పిల్లాడికి సూపర్‌ పవర్‌.
ఉపాధ్యాయులకు : పరీక్షకు వెళ్లే ముందు ఒక చిన్న చిరునవ్వు… ఒక చిన్న మాట: రిలాక్స్‌… మీరు చేయగలరు. అది వారి భయాన్ని అర్ధం తగ్గిస్తుంది. పిల్లలు నవ్వితే, రిలాక్స్‌ అయితే మెదడులో స్ట్రెస్‌ హార్మోన్‌ తగ్గుతుంది. అప్పుడు మెమరీ బాగా పనిచేస్తుంది. అందుకే చివరి రోజుల్లో భయపెట్టొద్దు, పోల్చొద్దు.
10వ తరగతి పరీక్షలు ముఖ్యమే. కానీ జీవితం అంతకంటే ముఖ్యమైనది. మార్కులు భవిష్యత్తులో మారిపోతాయి. ర్యాంకులు మరచిపోతారు. కానీ మనసు విరిగితే ఆ గాయం జీవితాంతం ఉంటుంది. పిల్లలు టాప్‌ చేయకపోయినా పర్లేదు. కానీ వారు సురక్షితంగా, సంతోషంగా ఉండాలి. మనం కలిసి ఈ పరీక్షల కాలాన్ని భరోసాతో మార్చుదాం.
పరీక్ష ఒక మెట్టు మాత్రమే. జీవితం ఒక పొడవైన ప్రయాణం.
నవ్వుతూ రాసిన పేపర్‌ ఎప్పుడూ మెరుగైన ఫలితమే ఇస్తుంది.
ముందుగా మనసు ప్రశాంతంగా ఉండాలి. అప్పుడు మార్కులు కూడా వస్తాయి.

డా|| హిప్నో పద్మా కమలాకర్‌,
9390044031
కౌన్సెలింగ్‌, సైకో థెరపిస్ట్‌, హిప్నో థెరపిస్ట్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -