డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ డి కృష్ణయ్య..
నవతెలంగాణ – వనపర్తి
పేదరిక నిర్మూలనే లక్ష్యంగా భావి తరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ డి కృష్ణయ్య అన్నారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ జిల్లా కార్యదర్శి వి రజని ఆదేశానుసారం శుక్రవారo అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం ను పురస్కరించుకొని వనపర్తి జిల్లా కేంద్రంలో తాడిపర్తి, అప్పాయిపల్లి గ్రామాల్లో పేదరిక నిర్మూలన పై అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ రైతులు, కార్మికులు, గ్రామస్థులు వారి పిల్లల కు మంచి విద్యను అభ్యసించేలా తోడ్పడి, వారిని ఉన్నత స్థాయిలో ఉండేలా కృషి చేయడం విద్య వల్లనే సాధ్యమవుతుందని తెలియజేశారు. ప్రభుత్వాలు అందించే సంక్షేమ, ప్రయోజనాల ను దిగువ మధ్య తరగతి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఉచిత న్యాయ సలహాల కోసం 15100 టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ రఘు, పంచాయతీ కార్యదర్శి సాయి కృష్ణా, గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
పేదరికాన్ని నిర్మూలించడానికి తోడ్పడుదాం
- Advertisement -
- Advertisement -