Tuesday, November 18, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఅందెశ్రీ సంతాప సభను ఘనంగా నిర్వహిద్దాం:మంత్రి అడ్లూరి

అందెశ్రీ సంతాప సభను ఘనంగా నిర్వహిద్దాం:మంత్రి అడ్లూరి

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణ రాష్ట్ర గీత రచయిత, ప్రముఖ కవి అందెశ్రీ సంతాప సభను ”రాష్ట్ర గౌరవానికి తగ్గట్టుగా తెలంగాణ ఆత్మను ప్రతిబింబించేలా ఘనంగా నిర్వహించాలి” అని ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో కవులు, కళాకారులు, దళిత సంఘాలు, ప్రజా సంస్థలు, ఉద్యోగ సంఘాలతో కలిసి ఆయన సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ నిర్ణయం నుంచి కళాకారులకు గౌరవం దక్కేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకున్నదనీ, ఇందుకు సీఎం ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని తెలిపారు. దళిత ఐక్యత సందేశంగా అందెశ్రీ సంతాప సభను విజయవంతం చేద్దాం” అని పిలుపునిచ్చారు. అందెశ్రీ అంత్యక్రియల్లో సీఎం స్వయంగా పాల్గొనడం కళాకారుల పట్ల ప్రభుత్వం చూపుతున్న గౌరవానికి ప్రత్యక్ష ఉదాహరణ అని తెలిపారు. అందెశ్రీ రచనలు భవిష్యత్‌ తరాలకు మార్గదర్శకాలని పేర్కొన్నారు. అందెశ్రీ సేవలను ప్రతిబింబించే విధంగా కవిసమ్మేళనాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు.ఈ సమావేశంలో ప్రొఫెసర్‌ కాశీం (ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్‌ కాలేజ్‌ ప్రిన్సిపాల్‌), ప్రొఫెసర్‌ విద్యాసాగర్‌ (వ్యవసాయ విశ్వవిద్యాలయం)తో పాటు సామాజిక సంఘాల నేతలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -