Monday, March 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చలో హైదరాబాద్ ను విజయవంతం చేద్దాం

చలో హైదరాబాద్ ను విజయవంతం చేద్దాం

- Advertisement -

2003 డీఎస్సీ సిద్దిపేట జిల్లా బాధ్యులు పి.శ్రీనివాస్
నవతెలంగాణ – మిరుదొడ్డి 

డీఎస్సీ 2003 ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 57/4,57/5 ఉత్తర్వులు మేరకు పాత పెన్షన్ ను వర్తింపజేయాలని కోరుతూ ఈనెల మార్చి 7న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరిగే  మహా విజ్ఞాపన సభకు డీఎస్సీ 2003 ఉపాధ్యాయిని ఉపాధ్యాయులందరూ అధిక సంఖ్యలో హాజరుకావాలని డీఎస్సీ జిల్లా బాధ్యులు పి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా అక్బర్ పేట భూంపల్లిలో మాట్లాడుతూ .. కేంద్ర ప్రభుత్వం తమ పరిధిలోని ఉద్యోగులందరికీ జనవరి 1 2024  ముందు నోటిఫికేషన్ వచ్చి నియామకం ఆలస్యమైన ఉద్యోగులందరికీ 57/4,57/5 ఉత్తరుల మేరకు పాత పెన్షన్ వర్తింపజేస్తున్నదనారు. 

అదేవిధంగా మన రాష్ట్రంలో  సెప్టెంబర్ ఒకటి 2024 నుండి నూతన పెన్షన్ అమలు కావడంతో అంతకు ముందు నోటిఫికేషన్ వచ్చి సెలక్షన్ ప్రక్రియ పూర్తయి అప్పటి ప్రభుత్వాల అలసత్వం , సర్వీసు రూల్స్ కారణంగా 2005 సంవత్సరంలో నియామకం కావడంతో నూతన పెన్షన్ విధానంలో నెట్టి వేయడం జరిగిందనీ అన్నారు. పాత పెన్షన్ విధానం అమలుకై రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించగా 2025 జూలై 29 న డీఎస్సీ 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేయాలని అన్నారు.

కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు మరియు రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులను అమలు పరచడంలో  జాప్యం జరుగుతున్నందుకు నిరసనగా ఈనెల మార్చి 7న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరగనున్న మహా విజ్ఞాన సభకు సిద్దిపేట జిల్లాలోని డీఎస్సీ 2003 ఉపాధ్యాయిని ఉపాధ్యాయ మిత్రులందరు కుటుంబ సమేతంగా  పాల్గొని మహా విజ్ఞాపన సభను దిగ్విజయం చేయాలని వారు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -