సిగ్మా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ కృష్ణ కిషోర్ రెడ్డి
నవతెలంగాణ – కంఠేశ్వర్
గుండెను కాపాడుకుందాం హాయిగా జీవిద్దాం అని,డోంట్ స్కిప్ హార్ట్ బిట్ నినాదంతో ముందుకు వెళ్దాం అంటూ సిగ్మా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ కృష్ణ కిషోర్ రెడ్డి ప్రజలకు సూచించారు. ఈ మేరకు సోమవారం హార్ట్ డే ను పురస్కరించుకొని సిగ్మా ఆస్పత్రి ఆవరణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిగ్మా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ కృష్ణ కిషోర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం 29 సెప్టెంబర్ న హార్ట్ డే ను నిర్వహించి ప్రజలకు ఒక మెసేజ్ ను ఇస్తారని ఈ సంవత్సరం డోంట్ స్కిప్ హార్ట్ బీట్ అనే నినాదంతో ప్రజలకు అవగాహన కలుపుతున్నామన్నారు.
ప్రతి సంవత్సరం రోజురోజుకు పెరాలసిస్, రోడ్డు ప్రమాదాల వంటి ఘటనలలో ప్రాణాలు కోల్పోతుంటారు. అయితేగత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తే 25 నుంచి 35 ఏళ్ల వయసు వారిలో గుండె జబ్బులు పెరిగి సడెన్ హార్ట్ ఎటాక్ లకు గురవుతున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. అందుకు పొగ తాగడం, మద్యం సేవించడం లాంటివి మానుకోవాలి. మాంసకృతులను అధిక మొత్తంలో తీసుకోకూడదు.
గుండెకు సంబంధించిన రక్తనాళాలు బ్లాకు అయినప్పుడు ఆక్సిజన్ అందక పనితీరు మందగిస్తుంది. అప్పుడు గుండె ఒత్తిడికి గురై నొప్పి వస్తుంది. దీన్ని హార్ట్ ఎటాక్ అంటాం. ముందుగా హార్ట్ ప్రాబ్లం వచ్చిందంటే దాని లక్షణాలు సాధారణంగా చాతి మధ్య భాగంలో నొప్పి రావడం, మంట, చెమటలు పట్టడం భుజం నుంచి చెయ్యి వరకు నొప్పి వాపు వస్తుండడం ఉంటే వెంటనే గుండెపోటుగా అనుమానించి డాక్టర్ను సంప్రదించాలి అని తెలియజేశారు.కనీసం మూడు నెలలకు ఒకసారి డాక్టర్ను సంప్రదిస్తూ ఉండటంవల్ల ఈ సమస్య నుంచి బయటపడటం సులువవుతుంది అని తెలియజేశారు.