Saturday, September 13, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఉద్యమిద్దాం..పాత పెన్షన్‌ సాధిద్దాం

ఉద్యమిద్దాం..పాత పెన్షన్‌ సాధిద్దాం

- Advertisement -

– ఫోన్‌ ఇన్‌ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి పిలుపు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌)కు వ్యతిరేకంగా ఉద్యమిద్దామనీ, పాత పెన్షన్‌ విధానం (ఓపీఎస్‌)ను సాధిద్దామని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. వచ్చేనెల ఒకటో తేదీన పీఆర్టీయూటీఎస్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగే పెన్షన్‌ విద్రోహ దినం మహాధర్నాలో ప్రతి ఉపాధ్యాయుడూ పాల్గొనాలని కోరారు. అందులో భాగంగా శుక్రవారం హైదరాబాద్‌లో పీఆర్టీయూటీఎస్‌ అధ్యక్షులు గుండు లక్ష్మణ్‌, ప్రధాన కార్యదర్శి పుల్గం దామోదర్‌రెడ్డితో కలిసి ఆయన ఉపాధ్యాయులతో వినూత్నంగా ఫోన్‌ ఇన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాల్లోని ఉపాధ్యాయులకు ఆయన ఫోన్‌ చేసి మహాధర్నా ఆవశ్యకతను వివరించారు. ప్రతి ఉపాధ్యాయుడు పాత పెన్షన్‌ కోసం చేపట్టే మహాధర్నాలో పాల్గొనాలని కోరారు. సీపీఎస్‌ రద్దు కోసం అనేక ఏండ్లుగా పోరాటం చేస్తున్నామనీ, ఈసారి టీచర్ల గళాన్ని గట్టిగా విన్పించాల్సిన అవసరం ఉందని వివరించారు. పీఆర్టీయూటీఎస్‌ నేతలు వారి జిల్లా పరిధిలో ఉపాధ్యాయులతో ఇదే రకమైన అవగాహన కార్యక్రమాన్ని చేపడుతున్నారని చెప్పారు. జిల్లా బాధ్యుల నుంచి ఫోన్లు అందుకున్న టీచర్లు ఇతర ఉపాధ్యాయులతో మహాధర్నా అవసరాన్ని వివరిస్తారని అన్నారు. గ్రామీణ స్థాయి ఉపాధ్యాయుల వరకూ ఫోన్‌ ఇన్‌ కార్యక్రమాన్ని తీసుకెళ్లామని వివరించారు. వచ్చేనెల ఒకటో తేదీన జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -