రెండుసార్లూ దాడులు చేశారు: ఇరాన్
మాట్లాడుకుందాం : అమెరికా
టెహ్రాన్ : అమెరికాతో చర్చలు జరిపే ప్రశ్నే లేదని ఇరాన్ తేల్చి చెప్పింది. చర్చలకు తాము సుముఖంగా ఉన్నామంటూ అమెరికా చేస్తున్న వాదనను తోసిపుచ్చింది. ‘వాషింగ్టన్‌తో చర్చలు పున: ప్రారంభించేందుకు మధ్యవర్తుల ద్వారా ఇరాన్ జాతీయ భద్రతా మండలి కార్యదర్శి అలీ లారిజానీ ప్రతిపాదన పంపారు’ అంటూ వాల్ స్ట్రీట్ జర్నల్‌లో వార్త వచ్చింది. అమెరికాతో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకునే అవకాశాలు ఇప్పటికీ ఉన్నాయా అని ఏబీసీ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ సమాధానమిస్తూ ‘చర్చలకు మేము ఎప్పుడూ సుముఖమే. అయితే మాపై దాడులు జరుగుతున్నాయి’ అని బదులిచ్చారు. గత 12 నెలల కాలంలో అమెరికాతో రెండు సార్లు చర్చలు జరిపామని, అయితే ఆ రెండు సందర్భాలలోనూ చర్చలు సాగుతున్న సమయంలోనే తమపై దాడి చేశారని, అవి మాకు చేదు అనుభవాన్ని మిగిల్చాయని చెప్పారు.
అమెరికాతో చర్చలు జరపం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



