నవతెలంగాణ – మద్నూర్: మద్నూర్ మండలంలోని పెద్ద తడగూర్ గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి శాంతాబాయి ఈరన్నకు జనాలు జై కొడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రజలే తండోపతండాలుగా తరలివచ్చి మీ సేవను వృధా కానివ్వమని ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారాన్ని మండల పార్టీ అధ్యక్షులు ధరాస్ సాయిలు పరిశీలించేందుకు పెద్దత్తడుగూరు గ్రామాన్ని గురువారం సందర్శించగా ఆయనకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శాంతాబాయి కుటుంబ సభ్యులు ఈరన్న ఆ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా చాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ.. ఈరన్నను గెలిపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలపై ఉందని జనాలు జై కొడుతున్న కూడా ఎదుటివారు ఏమీ చేయలేరని ధీమాలో ఉండకుండా పట్టుదలతో అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మద్నూర్ సింగిల్ విండో మాజీ చైర్మన్ కొండ గంగాధర్, ఆ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు సుభాష్, ఎన్నికల్లో వార్డు సభ్యులుగా పోటీ చేసే నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.
మీ సేవను వృధా కానివ్వం ఈరన్నకు జై కొడుతున్న జనాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



