– టి.సాగర్, ఆర్ వెంకట్‌రాములు పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తితో భూపోరాటాలకు సిద్ధమవుదామని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్రాములు పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్‌లోని రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో సుందరయ్య 40వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి నుండి విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి దిశానిర్దేశం చేశారని గుర్తు చేశారు. పేద రైతులకు, వ్యవసాయ కార్మికులకు భూపంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ సంక్షోభం, ఆత్మహత్యలు, భూ అసమానతలను నివారించేందుకు సమాయత్తం కావడమే ఆయనకు నిజమైన నివాళి అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అరిబండి ప్రసాదరావు, సహాయ కార్యదర్శి మూఢ్ శోభన్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
సుందరయ్య స్ఫూర్తితో భూపోరాటాలకు సిద్ధమవుదాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES