Tuesday, August 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాలికలను రక్షిద్దాం.. బాలికలను చదివిద్దాం

బాలికలను రక్షిద్దాం.. బాలికలను చదివిద్దాం

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
కాటారం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిణి డాక్టర్ మౌనిక ఆధ్వర్యంలో బేటి పడావో బేటి బచావో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా మహిళ  సాధికారత  జిల్లా ఇన్చార్జి డిస్టిక్ మిషిన్  కోఆర్డినేటర్ అనూష మాట్లాడుతూ..  మహిళలకు కేంద్ర ప్రభుత్వం బేటి బచావో  బేటి పడావో  పథకం ముఖ్యంగా ఆడపిల్లల రక్షణ విద్యా కోసం ప్రారంభించారని, ఆడ మగ సమానమేనని, బాల్యవివాహాలు నేరమని, లింగ వివక్షత చూపవద్దని, లింగ నిర్ధారణ చట్టం గురించి తెలియచేశారు.

ఇద్దరు ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని  ఉపయోగించుకోవాలని గర్భిణులు , బాలింతలకు పోషక ఆహారం ప్రాముఖ్యత గురించి ఆశ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఉమెన్ హెల్ప్ లైన్ 181  18 సంవత్సరాలలోపు పిల్లలు  ఆపద సమయంలో చైల్డ్ హెల్ప్ లైన్ 1098 వృద్ధులు 14567 సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1930 ఉపయోగించుకోవాలని తెలిపారు. సీజనల్  వ్యాధులు ప్రబలతున్న దృష్ట్యా ఆశా కార్యకర్తలు , ఆరోగ్య కార్యకర్తలు గ్రామాలలో ప్రతి శుక్రవారం, మంగళవారము విధిగా పర్యటించి సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

 డ్రై డే ప్రాముఖ్యత గురించి తెలిపి,  ప్రతి శుక్రవారం మంగళవారము ప్రజల చేత  డ్రై డే చేయించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైద్యాధికారిణి  డాక్టర్ మౌనిక  డిహెచ్ఈడబ్ల్యూ  జెండర్ స్పెషలిస్ట్  మమత , డాక్టర్ హారిక  డాక్టర్ సుమన్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ నిర్మల, ఆరోగ్య  కార్యకర్తలు, మహిళా హెల్త్ అసిస్టెంట్లు,  ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది,  గర్భిణీ స్త్రీలు , బాలింత స్త్రీలు  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -