జిల్లా శిశు సంక్షేమ అధికారులు
నవతెలంగాణ – మల్హర్ రావు
బాలికలకు రక్షిద్దాం..వారిని చదివిద్దామని జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారులు అన్నారు. బుధవారం మండలం వల్లెంకుంట గ్రామంలో జిల్లా శిశు సంక్షేమ అధికారి మల్లీశ్వరి ఆదేశాల మేరకు మండలం వల్లెంకుంట గ్రామపంచాయతీలో అంగన్ వాడి సూపర్వైజర్ భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో(ఉమెన్ హబ్) మహిళ సాధికారత కేంద్ర సిబ్బంది అనూష,మమత మహిళలకు అవగాహన సదస్సును నిర్వహించారు.మహిళ సాధికారత ఇంచార్జ్ డిస్ట్రిక్ట్ మిషన్ కోఆర్డినేటర్ శ్రీమతి అనూష మాట్లాడుతూ తల్లి పాల యొక్క ప్రాముఖ్యత గురించి, కేంద్ర ప్రభుత్వం ఆడపిల్లల రక్షణ, విద్య కోసం బేటి బచావో బేటి పడావో పథకం ప్రారంభించారని తెలిపారు.రవాణా,బాల్య వివాహా నిషేధ చట్టం,మొబైల్ వాడటం వల్ల జరిగే నష్టాలపై అవగాహన కల్పించారు.
ఆడపిల్లలపై లైంగిక వేధింపులు రోజురోజుకి ఎక్కువ అవుతున్నాయన్నారు.సోషల్ మీడియా పట్ల జాగ్రత్త ఉండాలని, వాట్సప్ ఇన్స్టాగ్రామ్ లో ఫొటోస్ పెట్టడం వల్ల సైబర్ నేరగాళ్లు ఫోటో మార్ఫింగ్ చేస్తారు కావున జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.18 సంవత్సరాల లోపు పిల్లలు ఆపద సమయంలో చైల్డ్ హెల్ప్ లైన్ 1098 టోల్ ఫ్రీ నెంబర్ నీ ఉపయోగించుకోవాలన్నారు.మహిళల హక్కులు, సేవలు అలాగే ఆడ మగ సమానమేనని బాల్య వివాహాలను అరికట్టాలని, లింగ వివక్షత చూప వద్దని, లింగ నిర్ధారణ చట్టం నేరమని,ఇద్దరు ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు సుకన్య సమృద్ధి యోజన పథకంను ఉపయోగించుకోవాలని తెలిపారు.మహిళలు ఆపద సమయంలో ఉమెన్ హెల్ప్ లైన్ 181 ,వృద్ధులు14567 ,సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1930 ఉపయోగించుకోవాలని తెలిపారు.అనంతరం చిన్నారులకు అన్నప్రాసన,బాలింతలకు శ్రీమంతాలు నిర్వహించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో డిహెచ్ఈ డబ్ల్యూ జెండర్ స్పెషలిస్ట్ మమత, కమ్యూనిటీ ఎడ్యుకేటర్ ప్రసాద్,అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎం,,ఆయాలు,ఆశాలు,గర్భిణీలు,బాలింతలు,మహిళలు పాల్గొన్నారు.
బాలికలను రక్షిద్దాం.. చదివిద్దాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES