Monday, February 23, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించుకుందాం

ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించుకుందాం

- Advertisement -

ఎస్టీయూ రాష్ట్ర విద్యా సదస్సులో ప్రొఫెసర్‌ కాశీం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించుకోవలసిన బాధ్యత మనందరిపైన ఉన్నదని ప్రొఫెసర్‌ కాశీం అన్నారు. స్టేట్‌ టీచర్స్‌ యూనియన్‌ తెలంగాణ స్టేట్‌ (ఎస్టీయూటీఎస్‌) ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌ కాచిగూడలోని సంఘ భవనంలో రాష్ట్ర అధ్యక్షులు జి.సదానందం గౌడ్‌ అధ్యక్షతన రాష్ట్ర ద్వితీయ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా నిర్వహించిన విద్యా సదస్సులో ప్రముఖ విద్యారంగ, సామాజిక విశ్లేషకులు ప్రొఫెసర్‌ కాశీం ముఖ్య వక్తగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం పాఠశాలలను మూసివేసే ఆలోచన విరమించుకోవాలనీ, విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకురావాలని కోరారు.

ప్రభుత్వ పాఠశాలల్లో మానవ వనరులతోపాటు, భౌతిక వనరులను కూడా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలనీ, ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగించరాదని, పాఠశాలలకు నాన్‌ టీచింగ్‌ పోస్టులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయ హక్కుల పరిరక్షణలో ఎస్టీయూ బాధ్యతాయుతమైన పాత్రను పోషిస్తున్నదని తెలిపారు. జి.సదానందం గౌడ్‌ మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ, డీఏ సాధన కోసం త్వరలో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -