Friday, May 9, 2025
Homeతెలంగాణ రౌండప్రాజ్యాంగాన్ని కాపాడుకుందాం..

రాజ్యాంగాన్ని కాపాడుకుందాం..

- Advertisement -

ఎస్సీఆర్పీఎస్ జాతీయ సలహాదారు నర్సయ్య 
నవతెలంగాణ – పెద్దవంగర
: భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎస్సీఆర్పీఎస్ జాతీయ సలహాదారు గుండాల నర్సయ్య అన్నారు. మండల కేంద్రంలో గురువారం జలగం శ్రీనివాస్ ఆధ్వర్యంలో షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సమితి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని తమకు అనుకూలంగా మార్చేందుకు మనువాదులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆర్‌ఎస్ఎస్ భావజాలంతో బీజేపీ ప్రభుత్వం పాలన చేస్తుందన్నారు. న్యాయ, విద్యా వ్యవస్థలను మనువాదులతో నింపేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. రాజ్యాంగంపై జరుగుతున్న కుట్రలను తిప్పి కొట్టాలన్నారు. పూలే, అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. జనాభా ప్రాతిపదికన షెడ్యూల్ కులాల హక్కులను సాధించుకోవాలన్నారు. కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు సోమారపు వీరస్వామి, ఉపాధ్యక్షుడు మంగలపల్లి రామస్వామి, గుడాల ప్రకాష్ రావు, జలగం జంపయ్య, చిలుక సైదులు, చింతల ఐలయ్య, చిలుక సిద్దు, చెడుపాక యాకస్వామి, రాంపాక సతీష్, దంతాలపల్లి మహేష్, సుంకరి యాకన్న, చిలుక శ్రీహరి, అయిత గణేష్, జలగం మహేందర్, జలగం యాకన్న తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -