Tuesday, January 27, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరాజ్యాంగాన్ని కాపాడుకుందాం

రాజ్యాంగాన్ని కాపాడుకుందాం

- Advertisement -

సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాజ్యాంగాన్ని కాపాడుకుందామని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్‌ పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్‌ టాప్ర కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను టాప్ర రాష్ట్ర అధ్యక్షులు పతాక ఆవిష్కరణ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకటేశ్‌ మాట్లాడుతూ ప్రస్తుత పాలకులు ఇప్పుడున్న రాజ్యాంగం స్థానంలో మనుస్మృతిని ప్రవేశపెట్టాలని చూస్తున్నారనీ, దేశ సంపదను కార్పొరేట్లకు అప్పగిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.కృష్ణమూర్తి, ఆర్థిక కార్యదర్శి జి.అశోక్‌, ఎం.నరహరి, ఎం.జనార్ధన్‌ రెడ్డి, డా.ఎల్‌.అరుణ, కె.నాగేశ్వర్‌ రావు, ఎం.కృష్ణారావు, రామ చంద్రుడు, మన్నె యాదగిరి, మస్తాన్‌ రావు, రామకృష్ణ, కె.బలరాం, ఎన్‌.రమేశ్‌, కమల కుమారి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -