Wednesday, July 30, 2025
E-PAPER
Homeమానవివేడి వేడిగా లాగించేద్దాం..

వేడి వేడిగా లాగించేద్దాం..

- Advertisement -

చిరు జల్లులు కురుస్తున్న చల్లని వేళ గరంగరంగా ఏమైనా స్నాక్స్‌ తినాలనిపించడం కామన్‌. ఇలాంటప్పుడు చాలా మంది ఇంట్లో వేడి వేడిగా అప్పటికప్పుడు పకోడీ, మిర్చి బజ్జీ వంటివి చేసుకుంటుంటారు. అయితే ఎప్పుడూ మిర్చి బజ్జీలే తినాలంటే బోరింగ్‌గా అనిపిస్తుంది. అందుకే మీ కోసం కొన్ని వెరైటీ బజ్జీలను పరిచయం చేస్తున్నాం. వీటిని ఒక్కసారి చేసుకుని తిన్నారంటే మళ్లీ మళ్లీ చేసుకోవాలనిపించేంత కమ్మగా ఉంటాయి. మరి అలాంటి బజ్జీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం…

ఆలూ మిర్చి బజ్జి
కావలసిన పదార్థాలు: ఆలుగడ్డలు – రెండు (చిన్నవి), బజ్జీమిర్చి – పది, శనగపిండి – కప్పు, కారం – టీస్పూన్‌, ధనియాల పొడి – టీస్పూన్‌, పసుపు – అర టీస్పూన్‌, ఉప్పు – తగినంత, జీలకర్ర – టీస్పూన్‌, కొత్తిమీర – కొద్దిగా, ఉల్లిగడ్డ – ఒకటి (చిన్నది), నూనె – వేయించడానికి సరిపడా, వంటసోడా – చిటికెడు, నిమ్మరసం – టీస్పూన్‌.
తయారీ విధానం: మిర్చీకి నిలువుగా గాట్లు పెట్టి గింజల్ని తీసి పెట్టుకోవాలి. ఆలుగడ్డలను ఉడకబెట్టి మెదుపుకోవాలి. స్టవ్‌మీద పాన్‌ పెట్టి ఒక టేబుల్‌ స్పూన్‌ నూనెవేసి వేడయ్యాక అర టీస్పూన్‌ జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిగడ్డ, అర టీస్పూన్‌ కారం, కొద్దిగా పసుపు, ఉప్పు, అర టీస్పూన్‌ ధనియాల పొడి వేయాలి. అవి వేగాక మెదిపిన ఆలుగడ్డ ముద్దను కూడా వేసి బాగా కలపాలి. చివరగా నిమ్మరసం, కొత్తిమీర చల్లి దించేయాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనెపోసి వేడిచేయాలి. ఒక గిన్నెలో శనగపిండి, అర టీస్పూన్‌ కారం, ధనియాలపొడి, జీలకర్ర, చిటికెడు పసుపు, ఉప్పు, వంటసోడా వేసి తగినన్ని నీళ్లుపోసి జారుగా కలుపుకోవాలి. గాట్లు పెట్టుకున్న మిర్చీల్లో ఆలుగడ్డ మిశ్రమం కూరి పిండిలో ముంచి, నూనెలో వేసి దోరగా కాల్చుకుంటే వేడివేడి ఆలూ మిర్చి బజ్జీలు సిద్ధం.

వంకాయ బజ్జీలు
కావల్సిన పదార్థాలు: ఉల్లిగడ్డ – రెండు(మీడియం సైజ్‌వి), జీలకర్ర – టీస్పూన్‌, చింతపండు – కొద్దిగా, ఉప్పు – టేస్ట్‌కి సరిపడా, కారం – టీస్పూన్‌(రుచికి తగినంత), పసుపు – అర టీస్పూన్‌, వెల్లుల్లి రెబ్బలు – మూడు, వంకాయలు – పావుకేజీ, శనగపిండి – కప్పు, బియ్యప్పిండి – పావు కప్పు, వాము – అరటీస్పూన్‌, నూనె – వేయించడానికి తగినంత.
తయారీ విధానం: ముందుగా రెసిపీలోకి అవసరమైన స్టఫింగ్‌ని సిద్ధం చేసుకోవాలి. మిక్సీ జార్‌ తీసుకొని అందులో మీడియం సైజ్‌లో కట్‌ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, జీలకర్ర, చింతపండు, టేస్ట్‌కి సరిపడా ఉప్పు, కారం, పసుపు, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తని పేస్ట్‌లా మిక్సీ పట్టుకొని పక్కనుంచాలి. ఇప్పుడు కాస్త ముదురుగా ఉండే తాజా పొడవాటి(మరీ పొడవైనవి వద్దు) వంకాయలను కడిగి తుడుచుకోవాలి. వాటిని చాకుతో మధ్యలోకి చీల్చుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్‌ మీద కడాయిలో సరిపడా నూనెను పోసుకొని కట్‌ చేసుకున్న వంకాయలను వేసుకొని సగం వరకు ఉడికించాలి. తర్వాత వాటిని చల్లారనివ్వాలి. ఈలోపు ఒక వెడల్పాటి మిక్సింగ్‌ బౌల్‌ తీసుకొని అందులో శనగపిండి, బియ్యప్పిండి, పసుపు, రుచికి తగినంత ఉప్పు, కారం, వాముని చేతితో నలిపి వేసుకొని అన్నీ చక్కగా కలిసేలా మిక్స్‌ చేసుకోవాలి. తర్వాత అందులో కొద్దికొద్దిగా నీరు పోసుకుంటూ ఉండలు లేకుండా, మరీ జారుడుగా కాకుండా కాస్త చిక్కగానే ఉండాలి. తర్వాత ఒక వెడల్పాటి గ్లాసులో పైన కాస్త గ్యాప్‌ ఉండేలా పిండిని పోసుకొని పక్కనుంచాలి. ఇలా పిండిని గ్లాసులో పోసుకోవడం ద్వారా బజ్జీలను చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఇప్పుడు చల్లారిన వంకాయ ముక్కలను తీసుకొని వాటిల్లో ముందుగా ప్రిపేర్‌ చేసుకున్న ఆనియన్‌ పేస్ట్‌ స్టఫింగ్‌ని అన్నింటిల్లో చక్కగా స్టఫ్‌ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్‌ మీద లోతైన కడాయిలో తగినంత నూనె పోసుకొని వేడి చేసుకోవాలి. తర్వాత మంట తగ్గించి పిండి ఉన్న గ్లాసు తీసుకొని అందులో స్టఫ్‌ చేసుకున్న వంకాయను పిండి చక్కగా పట్టేలా డిప్‌ చేసి కాగుతున్న నూనెలో వేసుకోవాలి. వాటిని వెంటనే కదపకుండా కాసేపు కాలనిచ్చి ఆపై అటు ఇటు తిప్పుతూ రెండు వైపులా చక్కగా వేయించుకోవాలి. అంతే, సూపర్‌ టేస్టీగా నోరూరించే గరంగరం ‘వంకాయ బజ్జీలు’ రెడీ.

మసాలా టమాట స్లైస్‌తో
కావాల్సిన పదార్థాలు: అల్లం – కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు – ఎనిమిది, ఉప్పు – టీ స్పూన్‌, పచ్చిమిర్చి – మూడు, కొత్తిమీర తరుగు – పిడికెడు, నిమ్మకాయ- అర చెక్క, శనగపిండి – కప్పు, నూనె – టీ స్పూన్‌, పసుపు – చిటికెడు, బేకింగ్‌ సోడా – చిటికెడు, టమాటలు – నాలుగు, నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా.
తయారీ విధానం: ముందుగా మిక్సీజార్‌ తీసుకుని అల్లం, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు, నిమ్మరసం వేసి కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ గట్టిగా, మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఓ ప్లేట్‌లోకి తీసుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు ఓ బౌల్‌ తీసుకుని అందులో శనగపిండి, ఉప్పు, నూనె, పసుపు వేసి బాగా కలపాలి. తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఓ ఐదు నిమిషాలు ఆగకుండా కలుపుతూనే ఉండాలి. ఇలా చేయడం వల్ల పిండి గుల్లగా మారి బజ్జీలు టేస్టీగా వస్తాయి. ఆ తర్వాత బేకింగ్‌ సోడా వేసి మరికొద్దిసేపు బీట్‌ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పెద్ద సైజ్‌లో తోలు మందంగా ఉన్న టమాటలు తీసుకుని శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. తర్వాత స్లైస్‌లుగా కట్‌ చేసుకోవాలి. డీప్‌ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె కాగేలోపు కట్‌ చేసిన టమాట ముక్కల మీద ముందుగానే సిద్ధం చేసుకున్న కొత్తిమీర పేస్ట్‌ను కొద్దికొద్దిగా అప్లై చేయాలి. ఈ ముక్కలను శనగపిండి మిశ్రమంలో ముంచి పిండి పట్టే విధంగా కోట్‌ చేసి కాగుతున్న నూనెలో వేసుకోవాలి. రెండు వైపులా ఎర్రగా కాల్చుకుంటే సరిపోతుంది.

తమలపాకుతో
కావల్సిన పదార్థాలు: తమలపాకులు – పది, శనగపిండి – పావు కేజీ, ఉప్పు – రుచికి సరిపడా, వాము – స్పూన్‌, కారం – అర స్పూన్‌, వంటసోడా – చిటికెడు, నూనె – వేయించడానికి సరిపడా, ఉల్లిగడ్డ – ఒకటి, చాట్‌ మసాలా – అర స్పూను, నిమ్మకాయం – ఒకటి.
తయారీ విధానం: ముందుగా తమలపాకులు తీసుకుని వాటిని బాగా కడిగి ఒక గుడ్డతో తుడిచి, పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‌ తీసుకుని అందులో శనగపిండి, కారం, ఉప్పు, కొంచెం బేకింగ్‌ సోడా, వాము, కొద్దిగా నీరు పోసి బజ్జీ పిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి. డీప్‌ ఫ్రై చేసుకునేందుకు ఒక బౌల్‌ తీసుకొని అందులో ఆయిల్‌ వేసుకుని బాగా వేడి చేయాలి. తర్వాత ముందుగా పక్కన పెట్టిన తమలపాకులు తీసుకుని ఒక్కొక్కటిగా బజ్జీ పిండిలో రెండు వైపులా ముంచి వేడి నూనెలో వేయండి. నూనెలో వేసిన తమలపాకు బజ్జీని బాగా ఎర్రగా రెండు వైపులా వేగనివ్వాలి. తర్వాత బయటకు తీసి కావాలనుకుంటే ఒక ఉల్లిగడ్డ సన్నగా కట్‌ చేసి అందులో కాస్త కారం, చాట్‌ మసాలా, ఉప్పు, నిమ్మకాయ పిండి బజ్జీ మధ్యలో కట్‌ చేసి పెట్టండి. చాలా రుచిగా ఉంటాయి.

RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -