యలమర్తి అనూరాథ గారి కథాసంపుటి ‘గుప్పెడు మనసు’ లోని ”గాంధీ కోరిన రాజ్యమా ఇదీ!” కథలో ఒక సాధారణ ప్రయాణం విషాదాంతమై మానవ విలువల పతనాన్ని, సమాజంలోని నిర్లక్ష్యాన్ని హదయ విదారకంగా ప్రతిబింబించారు. అలాగే ”ఎవరో వస్తారని” కథలో భర్త ఆధిపత్యం కింద బంధింపబడి ఉన్న ఒక స్త్రీ తన తల్లి చివరి క్షణాల్లో పక్కన ఉండలేకపోవడం ద్వారా స్త్రీ జీవితంలోని నిస్సహాయ స్థితిని ఆవిష్కరించారు. అలాగే ”ఆకాశమంత,” ”సమన్విత,” ”మధుమంజీరాలు,” ”ఔను నాకు నచ్చలేదు” వంటి కథలు కూడా మనసు తలుపు తట్టే సున్నితమైన అనుభూతులను, మానవ సంబంధాల విలువలను ప్రతిబింబిస్తాయి.
మానవత్వం, ఆప్యాయత, ఆనందం, అనుబంధాలు, కుటుంబ సంబంధాలకు ప్రతిబింబంగా నిలిచిన ”గుప్పెడు మనసు” కథా సంపుటి ఒక అద్దంలా పని చేస్తుంది. ”గుప్పెడు మనసు” లోంచి జాలువారినవి ఈ కథాసుమ పరిమళాలు. బంధం, అనుబంధం, అనురాగాల విలువలను తెలిపే అంశాలతో మంచిని వివరిస్తూ, చెడును ఖండిస్తూ సాగే కథనాలు పాఠకుని హదయాన్ని కదిలిస్తాయి. సామాజిక స్పహ కలగలిపిన రచనా మాధుర్యంతో యలమర్తి అనూరాథ గారి ఈ కథా సంపుటి వీరికి కథాసాహిత్యంలో మంచి గుర్తింపు తెచ్చింది.
-పుట్టంరాజు
ఓ పుస్తకం చదువుకుందాం
- Advertisement -
- Advertisement -



