Friday, April 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ బడులను కాపాడుకుందాం

ప్రభుత్వ బడులను కాపాడుకుందాం

- Advertisement -

ప్రధానోపాధ్యాయులు ఎండి సయ్యద్
నవతెలంగాణ – ఆలేరు రూరల్

ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించి ప్రభుత్వ బడులను కాపాడుకుందామని ప్రధానోపాధ్యాయులు ఎండి సయ్యద్ పేర్కొన్నారు. శుక్రవారం ఆలేరు మండలం మందనపెల్లి మండల ప్రాథమిక పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట సన్నాహక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం వంటి అనేక సౌకర్యాలు అందిస్తున్నారని తెలిపారు. గ్రామంలోని ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని పిలుపునిచ్చారు.

ప్రభుత్వ బడులు సమాజ అభివృద్ధికి పునాది అని,విద్య ద్వారానే పిల్లల భవిష్యత్తు బలపడుతుందని ఆయన అన్నారు. బడిబాట కార్యక్రమం ద్వారా డ్రాప్‌అవుట్ విద్యార్థులను తిరిగి పాఠశాలకు రప్పించి, అందరికీ విద్య అందేలా కృషి చేయాలని సూచించారు.అనంతరం గ్రామ సర్పంచ్ సిరుమర్తి రేణుక నరసయ్య మాట్లాడుతూ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను ప్రజలు వినియోగించుకోవాలని,పాఠశాల పురోగతికి గ్రామస్థులు భాగస్వాములు కావాలని తెలిపారు. పిల్లల విద్యపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, వారిని ప్రతిరోజూ పాఠశాలకు పంపాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పద్మ శశిరేఖ, వార్డ్ సభ్యులు, ఉపాధ్యాయులు,గ్రామ పెద్దలు,తల్లిదండ్రులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -