ఉప్పరపల్లి, సురాయిపల్లి ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే
నవతెలంగాణ – వనపర్తి
గ్రామాల్లో నెలకొన్న సమస్యలన్నీ సర్పంచ్ ఎన్నికల తర్వాత ఒక్కొక్కటిగా పరిష్కరించుకుందామని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి అన్నారు. ఖిల్లా ఘనపురం మండలం ఉప్పరిపల్లి, సురాయిపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే సోమవారం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు. ఉప్పరి సర్పంచ్ అభ్యర్థి నరసింహ గౌడ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. నరసింహ గౌడ్ ను గెలిపించుకుంటే గ్రామంలో ఏ సమస్య ఉన్నా వెంటనే పరిష్కరిస్తామన్నారు. గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కొత్త పెన్షన్లు, ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ పార్టీ పథకాలు ప్రతి ఒక్కటి గెలిచిన వెంటనే నెరవేరుస్తామని హామీ ఇచ్చారు.
సురాయిపల్లి గ్రామంలో ఏ సమస్య ఉన్నా సర్పంచ్ అభ్యర్థి ప్రియాంక గెలిచిన వెంటనే గ్రామంలో ఉండే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని వనపర్తి శాసనసభ్యులు మేఘా రెడ్డి అన్నారు. సూరాయిపల్లి గ్రామంలో గుడి, నీళ్లు, సీసీ రోడ్ల సమస్యలు ఏవి ఉన్నా సర్పంచిని గెలిపించిన వెంటనే తానే దగ్గరుండి చేయిస్తానని ఎమ్మెల్యే గ్రామస్తులకు హామీని ఇచ్చారు.
ఈ కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, డాక్టర్ పగడాల శ్రీనివాస్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆదిత్య, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బి కృష్ణ, టీపీసీ వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ద్యారపోగు వెంకటేష్, జిల్లా ఆర్టిఏ మెంబర్ జాంగిర్, మాజీ కౌన్సిలర్ విభూతి నారాయణ, ఎస్.కె షఫీ, అస్లాం, గణపురం మండల్ మాజీ ఎంపీపీ వెంకటయ్య, సింగిల్ విండో మాజీ చైర్మన్ వెంకటయ్య, గణపురం మండల అధ్యక్షులు విజయ్ కుమార్, ఉప్పరపల్లి సురాయిపల్లి గ్రామస్తులు పాల్గొన్నారు.



