Sunday, August 3, 2025
E-PAPER
Homeకవితమొలకెత్తుదాం..రండీ..!

మొలకెత్తుదాం..రండీ..!

- Advertisement -

కాలుష్యం కాలనాగై కాటేస్తున్న తరుణం
ఎత్తుగడలతో మనుగడపై మనిషి చేసే రణం
పధ్వి చిద్విలాసం మాని సలుపుతున్న వ్రణం
అతలాకుతలమై బ్రతుకులు బలిదానాల వైపు…
బ్రతకాలి..నిండునూరేళ్లూ మనిషి బ్రతకాలి..
ఓ ఆకుపచ్చ వసంతంలో
ఆహ్లాదమైన నవ్వుల్ని పువ్వుల్ని ఆస్వాదించాలి
మరణమదంగాలు మది చేరేలోపే
కొన్ని సంబురాలను..సస్య స్మతులను మూటగట్టుకోవాలి
ఎవరికి మాత్రం వుండదు
సంతోషాల్ని తనివితీర పంచుకోవాలనీ..
పచ్చని సంసారంగా పరిఢవిల్లాలనీ..
క్రియలు క్రియలుగా జన్మిస్తూ..జ్వలిస్తూ..కార్యోన్ముఖులమై
అవనిపై అక్షరాలా లక్షల మొక్కల్ని నాటేద్దాం..
పుడమి తల్లికి పచ్చలహారం తొడిగేద్దాం..
ఒకరిపై ఒకరం రంధ్రాన్వేషణలు మాని
రంధ్రాలు పడుతున్న ఓజోన్‌ పొరకు
వెచ్చని గుండెచప్పుడుతో పచ్చని తెరల్ని కుట్టేద్దాం..
పర్యావరణ సంక్షోభాల వత్తిళ్లను
చెట్టుతల్లి పొత్తిళ్లలో వదిలేసి
వసుధ గుమ్మానికి పచ్చని తోరణాలు కట్టేద్దాం..
గట్టు గట్టునా ఓ మొక్కై పుట్టుకొచ్చి
చెట్టు చెట్టుగా చుట్టుకొని హరితవనాలుగా వర్థిల్లి
ప్రాణవాయువుతో జగతికి బ్రతుకు నిద్దాం..
చెట్టే మనకు నీడనిచ్చే సోపతి..చెట్టే మనకు ఫలములిచ్చే సంపతి
ఉడుంపట్టులా మొక్కను పెట్టే పనిపట్టాలి
తెలంగాణ కట్టూబొట్టూ పచ్చనిబొట్టై నిలవాలి
రావి మావీ..మారేడు నేరేడు..నల్లమద్దీ తెల్లమద్దీ..
అశ్వగంధం శ్రీగంధం..ఉసిరి తపసి..పిల్లితీగ మల్లెతీగ
ఇలా ఇలా ఔషధ మొక్కల సంపదై విలసిల్లాలి
వటపత్రశాయికి వరహాలలాయి అంటూ..
మోక్షాన్నీ..వక్షాన్నీ..ఏకకాలంలో ఆస్వాదిద్దాం..
కంట్లో దాగిన దశ్యం కావ్యమై వెలిసినట్టు
ఇంట్లో నాటిన చెట్టు ఇంటి మనిషైనట్టు
ఆశయాలు పూసినట్టు ఆకాంక్షలు కాసినట్టు
పూలపండుగొచ్చినట్టు బతుకమ్మ నవ్వినట్టు
సమైక్యజీవనశాఖను అంటుగట్టుకొని
ఓ హరిత ఛత్రమై ఆకాశంపై నిలుద్దాం పదండీ..!
ఓ సాంస్కతిక పునరుజ్జీవనమై మొలకెత్తుదాం రండీ..!!

– డా.కటుకోఝ్వల రమేష్‌, 9949083327

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -