Tuesday, March 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డ్రగ్స్ ను అరికడదాం.. యువతను కాపాడుదాం

డ్రగ్స్ ను అరికడదాం.. యువతను కాపాడుదాం

- Advertisement -

సీఐ సంతోష్ పిలుపు
నవతెలంగాణ – ఆత్మకూరు
“డ్రగ్స్ అరికట్టదాం, మా యువతను కాపాడదాం” అంటూ ఆత్మకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్. సంతోష్ బలమైన పిలుపు ఇచ్చారు. తెలంగాణ నార్కాటిక్స్ బ్యూరో (టీఎన్‌బీ) డైరెక్టర్ సందీప్ శండిల్యా సూచనల మేరకు 99 రోజుల ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు మండల కేంద్రం, నీరు కుళ్ళు, పెద్దపూర్ గ్రామాల్లో మంగళవారం డ్రగ్స్ అవగాహన కార్యక్రమాలు పోలీసు అధికారులు విజయవంతంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమాల ద్వారా గ్రామీణ యువత, విద్యార్థుల్లో మాదక ద్రవ్యాల ప్రమాదాల గురించి విస్తృత అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రధాన అతిథిగా మాట్లాడిన సీఐ సంతోష్, “మాదక ద్రవ్యాల బారిన పడి మన యువత జీవితాలు నాశనం అవుతున్నాయి. ఇది కేవలం పోలీసుల బాధ్యత కాదు, ప్రతి పౌరుడి బాధ్యత. డ్రగ్స్ అమ్మకాలు, వాడకాలు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి” కోరారు.

మాదకాల వల్ల ఆరోగ్యం, భవిష్యత్తు, కుటుంబాలు  దెబ్బతింటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమాల్లో డిప్యూటీ తహసీల్దార్ భాస్కర మూర్తి, ఫారెస్టు అధికారి లక్ష్మణాచార్య, నార్కాటిక్ డ్రగ్స్ ఎస్‌ఐ మొగలి, స్థానిక సర్పంచ్ పర్వతగిరి మహేశ్వరి-రాజు, ఎక్సైజ్ శాఖ అధికారులు, ఎంపీఓ యోగిత తదితరులు పాల్గొన్నారు. పోలీసు కానిస్టేబుల్స్ కృష్ణి, కరణ్, శ్రీను కార్యక్రమం సాంకేతిక అంశాలు నిర్వహించారు. 100 మంది విద్యార్థులు, 20 మంది యువకులు, వార్డు మెంబర్ సందీప్‌ విద్యార్థిని విద్యార్థులు యువత పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -