Thursday, February 5, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేసుకుందాం

ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేసుకుందాం

- Advertisement -

రష్యా-చైనా సంబంధాలపై ఏకాభిప్రాయం
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌


క్రెమ్లిన్‌ : రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకుందామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అన్నారు. చైనా, రష్యా మధ్య సంబంధాలను ఆయన ప్రశంసించారు. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య భాగస్వామ్యానికి బలమైన ఆర్థిక, ఇంధన సంబంధాలు మద్దతు ఇస్తున్నాయి. బుధవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ద్వైపాక్షిక వాణిజ్య టర్నోవర్‌ అధిక స్థాయిలో స్థిరపడిందన్నారు.

ఇది ఏటా 200 బిలియన్‌ డాలర్లకు పైగా ఉందని పుతిన్‌ పేర్కొన్నారు. ఆసియా దేశానికి ఇంధన వనరులను అందించే ప్రముఖ సరఫరాదారుగా రష్యా స్థానాన్ని కూడా ఆయన నొక్కి చెప్పారు. మాస్కో, బీజింగ్‌ అంతర్జాతీయ న్యాయాన్ని నిలబెట్టాలనే తమ దృఢ సంకల్పాన్ని ప్రదర్శిస్తున్నాయని జిన్‌ గుర్తించారు. ద్వైపాక్షిక వాణిజ్యం , సాంస్కృతిక-మానవతా సంబంధాలు విజయవంతంగా అభివృద్ధి చెందుతున్నాయని కూడా ఆయన పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -