Saturday, March 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహిళా సంఘాల బలోపేతానికి కృషి చేద్దాం

మహిళా సంఘాల బలోపేతానికి కృషి చేద్దాం

- Advertisement -

సర్పంచ్ మహేశ్వరి మల్లేష్ 
నవతెలంగాణ – మిడ్జిల్ 

మహిళా సంఘాల బలోపేతానికి కృషి చేద్దామని, రాజకీయాలకతీతంగా గ్రామ అభివృద్ధి చేసుకుందామని సర్పంచ్ మహేశ్వరి మల్లేష్ అన్నారు. శనివారం మండలంలోని కంచనపల్లి గ్రామంలో మహిళా సంఘం నూతన భవన నిర్మాణానికి ఉపసర్పంచ్ లక్ష్మమ్మ ఐలయ్యతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధికి అందరూ సహకరించాలని ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు అర్హులైన పేదలందరికీ అందించాలని చెప్పారు.

గ్రామంలో సమస్యలన్నీ పరిష్కరించే విధంగా గ్రామపంచాయతీ సభ్యులు సహకరించాలని కోరారు. అందరి సహకారం ఉంటేనే గ్రామం అభివృద్ధి చెందుతుందని , ఎన్నికల అప్పుడే రాజకీయాలు చేయాలని ఎన్నికల తర్వాత అభివృద్ధిపై పాలకవర్గం దృష్టి పెట్టాలని అన్నారు. గ్రామంలోని అన్ని వార్డులను అభివృద్ధి చేసుకుందామని, ప్రభుత్వం నుంచి వచ్చే అభివృద్ధి పనులను కలిసి పని చేసుకుందామని తెలిపారు. మహిళా సంఘం భవనం త్వరగా పూర్తి చేసుకుందామని అన్నారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఏఈ  కృష్ణ, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు కృష్ణయ్య,  వార్డ్ నెంబర్ చెన్నయ్య, పాండు ,నాగ పుష్ప అశోక్, అరుణ ,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శంకరయ్య, నాగయ్య, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు శీను, నరసింహులు గౌడ్, వెంకటయ్య, నాగరాజు ,లింగం, భీమయ్య,  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -