Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్పర్యావరణ పరిరక్షణకై పాటుపడదాం..

పర్యావరణ పరిరక్షణకై పాటుపడదాం..

- Advertisement -

రైల్వేలో వివిధ శాఖ అధికారుల ప్రతిజ్ఞ 
నవతెలంగాణ – కంఠేశ్వర్
: ప్రపంచం పర్యావరణ పై అవగాహనా దినోత్సవ కార్యక్రమలలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజన్ లో ని నిజామాబాదు రైల్వే స్టేషన్ లో గురువారం చివరిరోజు కార్యక్రమం హెల్త్ ఇన్స్పెక్టర్ ప్రేమ సాగర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమం లో భాగం గా డివిజనల్ వైద్యాధికారి దీప ఆధ్వర్యంలో పర్యావరణపరిరక్షణకై పాటుపడుతామని దక్షిణ మధ్య రైల్వేలో వివిధ శాఖధికారులు ప్రతిజ్ఞ చేశారు అనంతరం ప్రయాణికుల అవగాహన నిమిత్తం సెల్ఫీ పాయింట్, ర్యాలీ, సంతకా లాసేకరణ, కర పత్రాల ద్వారా, పలువిధములైన అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్బంగా హెల్త్ ఇన్స్పెక్టర్ ప్రేమ సాగర్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ కై నిజామాబాదు రైల్వే కాలనీ పరిధిలో నేడు 50 పండ్లమొక్కలు, 20 పూలమొక్కలు పాతి పెట్టాము అని తెలియచేశారు. గత నెల 22 వతేదీ నుండి నేటి వరుకు ఈ కార్యక్రమం లో పాల్గొని సహకారమందించిన పాత్రికేయులకు ధన్యవాదములు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో హెల్త్ ఇన్స్పెక్టర్ ప్రేమ సాగర్, కమర్షియల్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ , సీనియర్ సెక్షన్ ఇంజనీర్ జనార్దన్ ,రైల్వే రక్షక దళ ఉప ఇన్స్పెక్టర్, సిబంది, రైల్వే చైల్డ్ హెల్ప్ డెస్క్ సిబంది సోని, ధర్మసింగ్, హౌస్ కీపింగ్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad