మహాదేవ్ డిమార్ట్ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాల పంపిణీ
మహాదేవ్ డిమార్ట్ యజమాన్యం
నవతెలంగాణ – నెల్లికుదురు
మండల కేంద్రంలోని మహాదేవ్ డిమార్ట్ ఆధ్వర్యంలో మట్టి గణపతులను మహాదేవ్ డిమార్ట్ యజమాన్యం లక్ష్మీనారాయణ. సవీన్. రాజు. నగేష్ ,శ్రీకాంత్ ,ఆధ్వర్యంలో మంగళవారం ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మట్టి వినాయకులను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా పంపిణీ చేస్తున్నామని అన్నారు. మట్టి గణపతి లను పూజిద్దాం ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడుకుందాం అని అన్నారు. నవరాత్రులు పూజలు నిర్వహించి ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం ఏర్పాటు చేసుకోవాలని కోరినట్లు తెలిపారు.
మండపాల వద్ద తగు జాగ్రత్తలు పాటించాలని కోరినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఉచితంగా మట్టి వినాయకులను మహాదేవ డిమార్ట్ యాజమాన్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నందుకు మండల ప్రజలు మహాదేవ్ డి మార్ట్ యజమాన్యాన్ని అభినందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మండల గుట్టయ్య గౌడ్, జిల్లా నాయకుడు దాసరి ప్రకాష్, వ్యాపారవేత్తలు బచ్చు శంకర్, బచ్చు నాగేశ్వరరావు, అల్లి మధు, వేముల శ్రీనివాస్, మోహన చారి, బొడ్డు రమేష్, పుల్లయ్య, ఆర్.ఎం.పి వైద్యుడు యాకయ్య వెంకటనారాయణ మహాదేవ్ డిమార్ట్ సిబ్బంది పాల్గొన్నారు.
మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES