Thursday, October 16, 2025
E-PAPER
Homeబీజినెస్“ఎసన్షియల్ సీరీస్”ను ప్రారంభించిన LG

“ఎసన్షియల్ సీరీస్”ను ప్రారంభించిన LG

- Advertisement -

నవతెలంగాణ – ముంబయి: LG ఎలక్ట్రానిక్స్ ఇండియా లిమిటెడ్. (LGEIL)  భారతదేశపు అభిప్రాయాలతో కింది స్థాయి నుండి  తయారైన ఒక కొత్త శ్రేణికి చెందిన గృహోపకరణాలు LG ఎసన్షియల్ సీరీస్ ను  ఈరోజు ప్రారంభించింది. LGEIL యొక్క పబ్లిక్ లిస్టింగ్ తరువాత కంపెనీ వారి మొదటి ప్రధానమైన వినియోగదారు కార్యక్రమం, ఈ ఎసన్షియల్ సీరీస్ భారతదేశానికి LG ఎలక్ట్రానిక్స్ (LG) వారి నవీకరించబడిన నిబద్ధతను సూచించింది- లక్షలాది కుటుంబాలకు ఆవిష్కరణను మరింత అందుబాటులో ఉంచుతూనే వారి పెరుగుతున్న అభిలాషలను నెరవేరుస్తోంది. కాంపైన్ నినాదం “హర్ ఘర్ అప్లైయెన్సెస్, హర్ ఘర్ హ్యాపీనెస్”, ద్వారా మరిన్ని కుటుంబాలు బ్రాండ్ వారి వాగ్ధానం లైఫ్ ఈజ్ గుడ్ ప్రత్యక్షంగా అనుభవించడాన్ని నిర్థారించడం ద్వారా LG భారతదేశపు వినియోగదారుల యొక్క జీవనశైలుల్ని మెరుగుపరిచే లక్ష్యాల్ని కలిగి ఉంది.

వివిధ జనాభాలు మరియు జీవనశైలులకి ప్రాతినిధ్యంవహించే భారతదేశంలోని 1,200కి పైగా కుటుంబాలు పాల్గొన్న తరువాత అభివృద్ధి చేయబడిన ఈ సీరీస్ రెండు సిద్ధాంతాలపై రూపొందించబడింది: “మేడ్ ఇన్ ఇండియా (భారతదేశంలో తయారైనవి)” మరియు “మేడ్ ఫర్ ఇండియా (భారతదేశం కోసం తయారు చేయబడినవి)“. భారతదేశపు వినియోగదారుల యొక్క రోజూవారీ సవాళ్లు మరియు కలల్ని నెరవేర్చడానికి ప్రతి ఉత్పత్తి రూపొందించబడింది మరియు ఉన్నతమైన సామర్థ్యం, మన్నిక మరియు ఆలోచనాత్మకమైన డిజైన్ ను అందుబాటులో ఉండే ధరలకు అందిస్తోంది
భారతదేశపు కుటుంబాల కోసం రూపొందించిన నాలుగు కీలకమైన ఉపకరణాలు ఈ LG ఎసన్షియల్ సీరీస్ లో ఉన్నాయి
–  ఫ్రాస్ట్-ఫ్రీ టెక్నాలజీ మరియు పెద్ద వెజిటబుల్ స్టోరేజ్ తో డబల్ డోర్ రిఫ్రిజిరేటర్
– దుమ్ము, తేమ మరియు తక్కువ నీటి ఒత్తిడి వంటి స్థానిక పరిస్థితుల్ని తట్టుకోవడానికి ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్ రూపొందించబడింది
– ఎనర్జీ మేనేజర్ +& డైట్ మోడ్+తో శక్తి వినియోగాన్ని తగ్గించే రూమ్ ఎయిర్ కండిషనర్
– ఆరోగ్యకరమైన, విలక్షణమైన కుకింగ్ కోసం ఇండియన్ ఆటో కుక్ మెనూలతో కన్వెర్టిబుల్ ఓవెన్, ఎయిర్ ఫ్రై మరియు కన్వెక్షన్ మోడ్స్.
“LGEIL విజయవంతంగా మార్కెట్ లిస్టింగ్ చేసిన తరువాత LG ఎసన్షియల్ సీరీస్ భారతదేశపు వినియోగదారులకు మా నిబద్ధతలో ఒక కొత్త అధ్యాయనాన్ని రూపొందించింది”, అని హాంగ్ జు జియాన్, LG ఎలక్ట్రానిక్స్ ఇండియా లిమిటెడ్ ప్రెసిడెంట్ అన్నారు. “వేలాది కుటుంబాల అభిప్రాయాలతో కింది స్థాయి నుండి రూపొందించబడిన ఈ సీరీస్ ప్రీమియం డిజైన్ మరియు రోజవారీ నమ్మకాన్ని ఒక చోట చేర్చింది. స్థానిక పరిస్థితుల కోసం ఉపకరణాలు రూపొందించబడటంతో ఇది భారతదేశపు కుటుంబాల నిజమైన అవసరాలను పరిష్కరిస్తుంది- సౌకర్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు రోజూవారీ జీవితాన్ని సుసంపన్నం చేస్తుంది. ఈ ప్రారంభంతో, LG లైఫ్ ఈజ్ గుడ్ ను మరింతగా అందుబాటులో ఉంచుతోంది, భారతదేశంవ్యాప్తంగా అభిలాషలను నిజం చేస్తోంది.”
భారతదేశం కోసం రూపొందించబడినవి: మన్నికమైనవి, ఉపయోగించడానికి అనుకూలమైనవి మరియు సృజనాత్మకమైనవి
– డబల్ డోర్ రిఫ్రిజిరేటర్ సరళతను ప్రీమియం ఉపయోగంతో కలపబడిన రిఫ్రిజిరేటర్ ఫ్రాస్ట్ ఫ్రీ టెక్నాలజీని తగిన ధరకు అందిస్తోంది, మేన్యువల్ గా డీఫ్రాస్టింగ్ చేసే అవసరాన్ని నిర్మూలిస్తోంది. దీని స్మార్ట్ మోడ్ సీజన్ మారినప్పుడు ఆటోమేటిక్ గా కూలింగ్ ను సర్దుబాటు చేస్తోంది. 20 శాతం పెద్ద (ఇంతకు ముందున్న మోడల్స్ తో పోల్చినప్పుడు) వెజిటబుల్ స్టోరేజ్ కంపార్ట్ మెంట్ ను అందిస్తోంది, ఇది శాకాహారుల కుటుంబాల కోసం ఉత్తమమైనది- భారీగా కిరాణా సరుకులు భద్రపరచవచ్చు.
ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడర్ వాషింగ్ మెషీన్: విభిన్నమైన భారతదేశపు పరిస్థితుల్లో మన్నిక కోసం రూపొందించబడింది, తక్కువ నీటి ఒత్తిళ్లల్లో కూడా ప్రభావవంతమైన వాషింగ్ కోసం వాషర్ లో లో ప్రెషర్ ఫిల్ టెక్నాలజీ ఫీచర్ ఉంది. BMC (బల్క్ మౌల్టింగ్ కాంపౌండ్) కవర్ తో ప్రో షీల్డ్ మోటార్ దుమ్ము, కీటకాలు, తేమ నుండి మెరుగైన రక్షణను కేటాయిస్తుంది, IPX4–ధృవీకరించబడిన నీటి-నిరోధకత కంట్రోల్ ప్యానల్ తేమ పరిస్థితుల్లో నమ్మకమైన ఆపరేషన్ ను అందిస్తుంది.
రూమ్ ఎయిర్ కండిషనర్: సౌకర్యవంతంగా జీవించడానికి రూపొందించబడిన ఈ ఉత్పత్తి ఎనర్జీ మేనేజర్+ “యు డిసైడ్ యువర్ బిల్” ఫంక్షన్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఇది వినియోగదారులు శక్తి వినియోగాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది – చాలామంది ఉత్పత్తి ధరకి బదులు అధికంగా వచ్చే విద్యుత్తు ఖర్చులు కారణంగా ఎయిర్ కండిషనర్లను కొనడానికి సందేహించే కీలకమైన విచారం ఇది. ద డైట్ మోడ్+ ఫీచర్ యూజర్లు కూలింగ్ టెంపరేచర్ మరియు వ్యక్తిగత సౌకర్యం రెండిటిని నిర్వహించడానికి అవకాశం ఇస్తుంది, మెరుగుపరచబడిన గాలి ప్రవాహాన్ని అందిస్తూనే శక్తి సామర్థ్యాన్ని అనుకూలం చేస్తోంది. బెడ్రూంలు లేదా స్టడీ రూమ్స్ వంటి చిన్న నుండి మధ్యస్థమైన సైజ్ గల ప్రదేశాలకు ప్రభావవంతంగా కూలింగ్ చేయడానికి ఉత్తమమైనది. ఉత్పత్తి ఫీచర్లు మరియు వివరణలు ఆయా మోడల్స్ ని బట్టి మారుతాయి.
కన్వెర్టిబుల్ ఓవెన్: భారతదేశపు సుసంపన్నమైన వంటకాల సంప్రదాయాలతో ప్రేరేపించబడిన ఈ ఓవెన్ లో ఆటో కుక్ మెనూలు ఉన్నాయి. నెయ్యి, పనీర్ మరియు పప్పు వంటి స్థానిక వంటకాల కోసం అనుకూలంగా చేయబడింది. ఎయిర్ ఫ్రై మరియు కన్వెక్షన్ మోడ్స్ గల ఇది, ఆధునిక విలక్షణత యొక్క సౌకర్యంతో ఆరోగ్యకరమైన వంటకాలు చేయడానికి వీలు కల్పిస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -