- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: మూసాపేటలోని ఆంజనేయ నగర్ లో ఆక్రమణలను హైడ్రా తొలగించింది. 2000 గజాల పార్కు స్థలంలో కబ్జాలను తొలగించి హుడా లేఔట్ ప్రకారం 2000 గజాలను పార్కు కోసం కేటాయించిన స్థలంగా నిర్దారించింది. గతంలో ఈ పార్కు అభివృద్ధికి GHMC రూ.50 లక్షలు విడుదల చేసింది. అయితే యాసిన్, అతని అనుచరగణం అడ్డుకోవడంతో పనులు ఆగిపోయాయి. GHMC, PS, ప్రజావాణిలో కబ్జాలపై ఫిర్యాదు రావడంతో హైడ్రా చర్యలు చేపట్టి పార్క్ స్థలానికి విముక్తి కలిగించింది.
- Advertisement -