Monday, October 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రంధాలయాలు దేవాలయాలతో సమానం

గ్రంధాలయాలు దేవాలయాలతో సమానం

- Advertisement -

జిల్లా న్యాయ సేవఅధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జ్ వి రజని 
నవతెలంగాణ – వనపర్తి

గ్రంధాలయాలు దేవాలయాలతో సమానం అని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జ్ వి రజని అన్నారు. సోమవారం వనపర్తి జిల్లా కేంద్రం లోని జిల్లా గ్రంథాలయంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పుస్తక పాఠకులకు చట్టాలపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో కార్యదర్శి గారు మాట్లాడుతూ పిల్లలు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల కనీస అవసరాలను తీర్చకపోయిన వారికి గృహంలో స్థానం కల్పించకపోయినా “తల్లిదండ్రుల, వయోవృద్ధుల పోషణ మరియు సంరక్షణ చట్టం, 2007” ప్రకారం రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ కు తమ పిల్లలనుండి నెలకు సరిపడు డబ్బులు ఇప్పించాలని మెయింటెనెన్స్ కంప్లైంట్ ఇవ్వవచ్చు అని తెలియజేశారు.

అత్యధికంగా పదివేల రూపాయల వరకు మెయింటెనెన్స్ అమౌంట్ కోరవచ్చని తెలిపారు. ఎవరైనా తల్లిదండ్రులను నిరాశ్రయులను చేస్తే 14567 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి కంప్లైంట్ చేయాలని సూచించారు. అదేవిధంగా బాల్యవివాహాల నిషేధ చట్టం మరియు మోటార్ వాహనాల చట్టం గురించి వివరించారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ పనితీరు గురించి మరియు ఏ విధముగా సంస్థ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలకు , విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పిస్తుందో తెలియజేశారు న్యాయ సలహాల కొరకు 15100 టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించవచ్చు అని తెలియజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కృష్ణయ్య, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఏం రఘు, గ్రంథాలయ కార్యదర్శి వెంకటయ్య మరియు గ్రంథాలయ ఇంచార్జ్ తేజ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -