Monday, September 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కార్మికులకు టీషర్ట్స్ పంపిణీ చేసిన గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి 

కార్మికులకు టీషర్ట్స్ పంపిణీ చేసిన గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి 

- Advertisement -

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
హుస్నాబాద్ మండలంలోని 17 గ్రామపంచాయతీలో పని చేస్తున్న పారిశుద్ధ కార్మికులకు ఒకరికి  రెండు చొప్పున సోమవారం హుస్నాబాద్ లో జిల్లా గ్రంధాలయ చైర్మన్ కేడం లింగమూర్తి టీషర్ట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  గ్రామాలు సుందరీకరంగా ఉన్నాయంటే గ్రామంలో పనిచేసే పారిశుద్ధ కార్మికుల యొక్క శ్రమ ఎంతో ఉందన్నారు. ఉదయం 6 గంటలకు లేసి గ్రామాలలో ఉడుస్తూ డ్రైనేజీలను క్లీన్ చేస్తూ గ్రామంలో ఎంతో సేవ చేస్తున్నారన్నారు.17 గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న కార్మికులకు  92 టి షర్టులను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏఎంసి వైస్ చైర్మన్ బంక చందు, చిత్తారి పద్మ, వల్లపూ రాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -