Sunday, July 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డైలీ దినపత్రికలు రాక ఇబ్బందులు పడుతున్న గ్రంథాలయ పాఠకులు

డైలీ దినపత్రికలు రాక ఇబ్బందులు పడుతున్న గ్రంథాలయ పాఠకులు

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండల కేంద్రంలోని గ్రంథాలయంలో నిత్యము డైలీ దినపత్రికలు గత వారం రోజులుగా రావడం లేదని పాఠకులు మండిపడుతున్నారు. పట్టించుకోవాల్సిన గ్రంథపాలకుడు స్థానికంగా ఉండకుండా మూడు మండలాలకు ఇన్చార్జిగా వ్యవహరిస్తూ ఆదరణ కొరవడిందనే వాస్తవం తేటతెల్లం అయింది. కొన్నేళ్లుగా ఇన్చార్జి గ్రంథాలయ పాలకుడు ఒక అసిస్టెంట్ ని నియమించుకొని అతని చేత కాలం వెళ్లదీస్తున్నారు. ఇటీవలే దాతలు వేల రూపాయలు ఖర్చు చేసి ఫర్నిచర్, కొన్ని పుస్తకాలు ఉచితంగా అందించడం జరిగింది కానీ గ్రంథ పాలకుడు అవకతవకలకు పాల్పడుతూన్నాడని ఆరోపణలు గుప్పు మంటున్నాయి. లైబ్రరీయన్ గ్రంథాలయానికి రాకుండా ఎప్పుడో వారంలో ఒకసారి లేదా రెండుసార్లు చుట్టపు చూపుగా వచ్చి వెళ్లడం నిత్యం పరిపాటిగా మారింది. సమస్యలు తెలిసినా తమకేమీ పట్టనట్టుగా నన్నెవరూ అడిగే వారు ఉన్నారని ధీమాగా ఉంటున్నారని పాఠకులు అంటున్నారు. పాఠకులకు అందుబాటులో ఉండాల్సిన పాఠ్యపుస్తకాలు, దినపత్రికలు ,  మ్యాగ్జైన్స్ లేకుండా పోతున్నాయి. జుక్కల్ గ్రంథపాలకుడు ఇన్చార్జి వ్యవహారంతో ఎక్కడ ఉంటున్నాడో ? తెలియకుండా తమకు కావలసిన పుస్తకాలు ఎవరు ఇస్తారో ?  ఎక్కడ ఉన్నాయో ? తెలియక కాంపిటేటివ్ పోటీ  పరీక్షలు రాసే పేద పాఠకులు , విద్యార్థిని ,  విద్యార్థులకు అయోమయంలో ఉన్నారు. ఇప్పటికైనా జిల్లా గ్రంథాలయ చైర్మన్ జుక్కల్ గ్రంథాలయ పాలకొన్ని వ్యవహారం పైన విచారణ చేపట్టాలని అన్నారు . వెంటనే జుక్కల్ నుంచి గ్రంథ పాలకున్ని తొలగించాలని కొత్తవారిని నియమించాలని పాఠకులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -