Wednesday, December 24, 2025
E-PAPER
Homeబీజినెస్గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించిన ఎల్‌ఐసీ హెచ్‌ఎఫ్‌ఎల్‌

గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించిన ఎల్‌ఐసీ హెచ్‌ఎఫ్‌ఎల్‌

- Advertisement -

న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించినట్టు ప్రకటించింది. కనీస వడ్డీ రేటును గతంలో కంటే తగ్గించి 7.15 శాతానికి పరిమితం చేసినట్టు ఆ సంస్థ పేర్కొంది. రుణగ్రహీతలు 825 పైగా సిబిల్‌ స్కోర్‌ కలిగిన వారికి అత్యల్ప వడ్డీ రేటును అమలు చేస్తోన్నట్టు తెలిపింది. రూ.5 కోట్ల వరకు తీసుకునే గృహ రుణాలపై ఈ రేట్లు వర్తిస్తాయని తెలిపింది. సిబిల్‌ స్కోరు, లోన్‌ మొత్తాన్ని బట్టి వడ్డీ రేట్లు వేర్వేరు శ్రేణుల్లో ఉంటాయని వెల్లడించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -