- Advertisement -
న్యూఢిల్లీ : గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించినట్టు ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ వెల్లడించింది. ఆర్బీఐ ఇటీవల రేపురేటును తగ్గించిన నేపథ్యంలో తమ సంస్థ కూడా వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు కోత పెట్టామని పేర్కొంది. దీంతో గృహ రుణాలపై వడ్డీ రేట్లు 7.50 శాతం నుంచి ప్రారంభమవుతాయని ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ఎండీ, సీఈఓ త్రిభువన్ అధికారి తెలిపారు. కొత్త వడ్డీ రేట్లు జూన్ 19 నుంచి అమల్లోకి వచ్చాయని సంస్థ 36వ ఫౌండేషన్ డే సందర్బంగా వెల్లడించారు. వడ్డీ రేట్ల తగ్గింపునతో నివాసాలకు డిమాండ్ పెరగనుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
- Advertisement -